Shraddha Walker case: 7 షాకింగ్ నిజాలు చెప్పిన కొత్త గాళ్‌ఫ్రెండ్
ABN , First Publish Date - 2022-11-30T16:19:22+05:30 IST
శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అఫ్తాబ్ పూనావాలా కొత్త గాళ్‌ఫ్రెండ్ పోలీసుల..
Shraddha Walker case: 7 షాకింగ్ నిజాలు చెప్పిన కొత్త గాళ్‌ఫ్రెండ్
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్
సం|| 93979 79750
న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసు (Shraddha Walker Murder case)లో ప్రధాన నిందితుడైన అఫ్తాబ్ పూనావాలా (Aftab poonawala) కొత్త గాళ్‌ఫ్రెండ్ పోలీసుల ఇంటరాగేషన్‌లో సంచలన విషయాలు బయటపెట్టింది. తన లివ్-ఇన్-పార్టనర్ శ్రద్ధను మే 18న అత్యంత పాశవికంగా హత్య చేసిన అఫ్తాబ్.. ఆ మృతదేహం ఫ్రిజ్‌లో ఉండగానే కొత్త గాళ్‌ఫ్రెండ్‌ను ఇంటికి తెచ్చుకుని డేటింగ్ చేసిన విషయం ఈ కేసులో మరింత ఆసక్తిని రేపింది. వృత్తి రీత్యా సైకియాట్రిస్ట్ అయిన ఆమె రెండుసార్లు అఫ్తాబ్‌ను అతని ఫ్లాట్‌లో కలుసుకుంది. ''అఫ్తాబ్ కసాయివాడనే అనుమానమే నాకు కలగలేదు. అతని ప్రవర్తన కూడా అలా కనిపించలేదు. అమ్మో...నన్ను కూడా అలా ముక్కలు చెక్కలు చేసి చంపేసేవాడేమో?'' అంటూ పోలీసుల ఇంటరాగేషన్‌లో ఆమె వణికిపోతూ చెప్పింది. తప్పు చేసి భయపడుతున్నట్టు అతను ఎప్పుడూ కనబడలేదని, ముంబైలోని ఇంటి గురించే తనతో ఎక్కువగా మాట్లాడుతుండేవాడని చెప్పింది.
తన న్యూ పార్టనర్ గురించి ఇంకా ఏం చెప్పిదంటే...
1.శ్రద్ధను హత్య చేసిన ఛత్రపూర్ ఫ్లాట్‌కు కొత్త గాళ్‌ఫ్రెండ్ (సైకియాట్రిస్ట్) అక్టోబర్‌లో రెండుసార్లు వెళ్లింది.
2. శ్రద్ధ మృతదేహాన్ని అఫ్తాబ్ ముక్కలు చెక్కలు చేసి ఫ్రిజ్‌లో ఉంచిన విషయంపై ఆమెకు ఎలాంటి అనుమానం రాలేదు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఆమె దృష్టికి రాలేదు.
3.ఆఫ్తాబ్ చాలా సాధారణంగా, ఎంతో కేరింగ్ పర్సన్‌గా కనిపించేవాడు. అతని మానసిక పరిస్థితి బాగోలేదనే అనుమానం కూడా ఎప్పుడూ కలగనీయలేదు.
4.సుగంధ ద్రవ్యాలు, సెంట్లు సేకరణంటే తనకు ఇష్టమని చెప్పడమే కాకుండా, వాటిని కొత్త గాళ్‌ఫ్రెండ్‌కు బహుమతులుగా ఇచ్చేవాడు.
5.అఫ్తాబ్ సిగరెట్లు బాగా తాగేవాడు. సిగరెట్ పొడి చేతిలో తీసుకుని బాగా నలిపి మళ్లీ సిగరెట్‌గా చేసి తాగే అలవాటు ఉండేది. త్వరలోనే ధూమపానం మానేస్తానని చెప్పేవాడు.
6.రకరకాల ఆహార పదార్ధాలను చాలా ఇష్టపడేవాడు. వివిధ రెస్టారెంట్ల నుంచి నాన్-విజిటేరియన్ పదార్ధాలకు ఆర్డర్ ఇచ్చేవాడు. రెస్టారెంట్లలోని పదార్ధాలను ఆకర్షణీయంగా కనిపించేందుకు వంటవాళ్లు ఏ విధంగా అలంకరించే వారో తన గాళ్‌ఫ్రెండ్‌కు వివరించే వాడు.
7.అఫ్తాబ్ తన గాళ్‌ఫ్రెండ్‌కు ఒక ఫ్యాన్సీ ఆర్టికల్ రింగ్‌ను బహుకరించాడు. అది శ్రద్ధ చేతికి ఉండే ఉంగరమని, దాన్నే తన కొత్త గాళ్‌ఫ్రెండ్‌కు అతను ఇచ్చాడని అనుమానిస్తున్నారు.
మరో 15 నుంచి 25 మంది అమ్మాయిలతో...
డేటింగ్ సైట్ల ద్వారా 15 నుంచి 20 మంది ఆడపిల్లలతో అఫ్తాబ్‌కు కాంటాక్టులు ఉండేవని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. విచారణలో భాగంగా అఫ్తాబ్ ''బంపెల్ యాప్'' రికార్డును కనుగొన్న పోలీసులు కూపీ లాగారు. శ్రద్ధ హత్యకు గురైన 12వ రోజైన మే 30న అతను ఇదే యాప్‌తో తన కొత్త గాళ్‌ఫ్రెండ్‌తో మాట్లాడాడు. ఆ తర్వాత
అఫ్తాబ్ ఇంట్లోనే అతన్ని రెండుసార్లు ఆమె కలుసుకుంది. శ్రద్ధను అఫ్తాబ్ అత్యంత పాశవికంగా నరికి చంపాడనే విషయం తెలియడంతో ఆమె ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదు. తమకు కావాల్సిన వివరాలను రాబట్టుకున్న పోలీసులు ప్రస్తుతం ఆమెకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
No comments:
Post a Comment