Tuesday, November 29, 2022

Murder : భర్తను 10 ముక్కలు చేసింది

 Murder : భర్తను 10 ముక్కలు చేసింది

ABN , First Publish Date - 2022-11-29T01:45:20+05:30 IST


కొడుకు సాయంతో భర్తను కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలుగా నరికి, ఆ శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచి వీలు చిక్కినప్పుడల్లా వాటిని ఇంటికి దూరంగా పడేసింది ఓ భార్య.


Murder : భర్తను 10 ముక్కలు చేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్

సం|| 93979 79750

కొడుకుతో కలిసి హత్య.. ఢిల్లీలో మరో ఘటన


శ్రద్ధ హత్యకు గురైన మేలోనే ఘాతుకం


నిందితులు పూనమ్‌, దీపక్‌ అరెస్టు


పూనమ్‌కు మృతుడు అంజన్‌ రెండో భర్త


ఆమె కుమార్తె, కోడలిపై అంజన్‌ కన్ను!


నిద్ర మాత్రలిచ్చి.. గొంతునరికి హత్య


ముక్కలు చేసి ఫ్రిజ్‌లో నిల్వ.. తర్వాత పారవేత


దొరికిన శరీర భాగాలతో పోలీసుల దర్యాప్తు


న్యూఢిల్లీ, నవంబరు 28: కొడుకు సాయంతో భర్తను కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలుగా నరికి, ఆ శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచి వీలు చిక్కినప్పుడల్లా వాటిని ఇంటికి దూరంగా పడేసింది ఓ భార్య. శ్రద్ధావాకర్‌ హత్యను తలపిస్తున్న ఈ ఘటన ఢిల్లీలోనే, శ్రద్ధ హత్యకు గురైన మే నెలలోనే జరిగింది. భర్త పేరు అంజన్‌దా్‌స(45). భార్య పూనమ్‌(48), కొడుకు దీపక్‌. ఢిల్లీలో పాండవ్‌నగర్‌లో ఉండేవారు. పూనమ్‌కు అంజన్‌దా్‌స రెండో భర్త. అతన్ని పెళ్లి చేసుకొనే సమయానికి ఆమెకు ఒక కుమార్తె. కుమారుడు ఉన్నారు. మద్యానికి బానిసైన అంజన్‌దా్‌స పూనమ్‌ కూతురు, కోడలిపై కన్నేశాడు. ఇది భరించలేని పూనమ్‌, కుమారుడు దీపక్‌తో కలిసి భర్తను చంపేసింది. పథకం ప్రకారం అంజన్‌దా్‌స తాగే మద్యంలో నిద్రమాత్రలు కలిపింది. అతడు స్పృహ కోల్పోయాక దీపక్‌, పూనమ్‌ కత్తితో అతని గొంతు నరికారు. శరీరం నుంచి రక్తం మొత్తం వెళ్లిపోయేదాకా ఆగి అంజన్‌ను 10 ముక్కలు చేశారు. ఆ అవయవాలను ఫ్రిజ్‌లో పెట్టారు. తర్వాత మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాటిని ఇంటికి దూరంగా పడేశారు. తలను పాతిపెట్టారు.


జూన్‌ 5న అవయవాలతో బ్యాగు


ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం సమీపంలో జూన్‌ 5న పోలీసులకు ఓ బ్యాగు కనిపించింది. అందులో మనిషి అవయవాలు ఉన్నాయి. తర్వాత కొన్ని రోజులకు కాళ్లు, పుర్రె, చేతు దొరికాయి. పోలీసులు హత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అవయవాలు దొరికిన ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ప్రశ్నించారు. దర్యాప్తులో ఆ మృతదేహం అంజన్‌దా్‌సది అని తెలిసింది. కాగా, పూనమ్‌, అంజన్‌ దాస్‌ 2017లో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే దాస్‌కు బిహార్‌లో మరో కుటుంబం ఉంది. అక్కడ అతనికి భార్య, 8 మంది పిల్లలు ఉన్నారు.


Updated Date - 2022-11-29T01:57:18+05:30 IST

No comments:

Post a Comment