సుపారీకి 2కోట్ల భూమి విక్రయం
ఉగ్రవాది బారీతో మారుతీరావు ఒప్పందం... అతడి ద్వారా రంగంలోకి అస్గర్ అలీ
అస్గర్‌తో సుభాష్ శర్మకు జైలులో పరిచయం
అతడికే సుపారీ అప్పగించిన అస్గర్ అలీ
1,200 పేజీల చార్జిషీట్‌లో పేర్కొన్న పోలీసులు
నల్లగొండ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): తన కూతురు అమృత-ప్రణయ్‌ల వ్యవహారం తెలియగానే.. వారి ప్రేమను మొగ్గలోనే తుంచేయడానికి మారుతీరావు ప్రయత్నించారు. అది కుదరకపోవడంతో.. ప్రణయ్‌పై దాడి, హత్యకు కుట్రపన్నారు. అందుకోసం సుపారీ ఇవ్వాలని నిర్ణయించాడు. ఈ క్రమాన్ని పోలీసులు మంగళవారం కోర్టుకు సమర్పించిన 1,200 పేజీల చార్జిషీట్‌లో పూసగుచ్చినట్లు వివరించారు. మొత్తం 102 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయగా, 50 పేజీల డాక్యుమెంటరీ ఆధారాలను, 25 పేజీల మెటీరియల్ ఎవిడెన్స్‌ను కోర్టుకు అందజేశారు. పోలీసుల చార్జిషీట్ ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. ప్రణయ్-అమృత ప్రేమను జీర్ణించుకోలేని మారుతీరావు, అతడి సోదరుడు శ్రవణ్.. ఆదిలోనే ఆ జంటను విడదీసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రేమను మొగ్గలోనే తుంచేయాలని ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ప్రణయ్‌పై శ్రవణ్ ఓసారి దాడి చేశాడు.
చివరగా.. ప్రణయ్ అడ్డు తొలగించడమే పరిష్కారమనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో సుపారీ (కిరాయి హత్య) కోసం 2,025 గజాల స్థలాన్ని రూ. 2 కోట్లకు విక్రయించారు. మారుతీరావు డబ్బు సమకూర్చుకున్నాక.. తన మిత్రుడు కరీం ద్వారా ఉగ్రవాది బారీని సంప్రదించాడు. అతడి ద్వారా అస్గర్‌అలీ పరిచయం అయ్యాడు. ప్రణయ్ హత్య కోసం అస్గర్ అలీకి రూ. 15 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. రాజమండ్రి జైలులో తనకు పరిచయమైన బిహార్‌కు చెందిన సుభా్‌షశర్మకు అస్గర్ అలీ ఆ పనిని అప్పగించాడు.గణేశ్ విగ్రహం కొనేప్పుడే...
తొలుత ప్రణయ్‌ను 2018 సెప్టెంబరు 12న వినాయకచవితి సందర్భంగా గణేశ్ విగ్రహం కొనే సందర్భంలో మిర్యాలగూడలో చంపేయాలని సుభా్‌షశర్మ స్కెచ్ వేశాడు. ఆ రోజు అక్కడ రద్దీ అధికంగా ఉండటంతో కుదరలేదు. అదే సమయంలో.. గర్భవతిగా ఉన్న అమృత తన తల్లికి ఫోన్ చేసి.. 14వ తేదీన ఆస్పత్రిలో చెక్‌పకు వెళ్తున్నట్లు చెప్పింది. మారుతీరావు ఆ విషయాన్ని బారీకి చేరవేశాడు. దీంతో.. హైదరాబాద్‌లో ఉన్న సుభా్‌షశర్మ హుటాహుటిన మిర్యాలగూడకు చేరుకున్నాడు.
అస్గర్‌అలీ, ఆటోడ్రైవర్ నిజాంతో కలిసి ఆటోరిక్షాలో.. సుభా్‌షశర్మ ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి వెళ్లారు. సుభా్‌షశర్మ అదును చూసుకుని ప్రణయ్‌ను కత్తితో నరికి చంపాడు. ఆ తర్వాత ఆ ముగ్గురూ త్రిపురారం మీదుగా నల్లగొండకు వెళ్లారు. సుభా్‌షశర్మ హత్యకు ఉపయోగించిన కత్తిని ఎన్‌ఎ్‌సపీ కెనాల్‌లో పారేశాడు.

No comments:
Post a Comment