Wednesday, March 18, 2020

యువకుడిపై ఫిర్యాదు చేసిన అమృత

యువకుడిపై ఫిర్యాదు చేసిన అమృత
Mar 15, 2020, 20:55 IST
Amrutha Pranay Complaint On Vijay At Miryalaguda - Sakshi
సాక్షి, నల్గొండ : మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్‌ భార్య అమృత ఓ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి ఎదురుగా ఉండే విజయ్‌ అనే యువకుడు తన వ్యక్తిగత సమాచారాన్ని ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు కరీంకు చేరవేస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విజయ్‌ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. కాగా గత ఏడాది దారుణ హత్యకు గురైన ప్రణయ్‌ కేసులో కరీం నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. అమృత తండ్రి మారుతీరావు మరణం అనంతరం.. శనివారమే ఆమె తల్లి గిరిజను కలిశారు.


పోలీసుల రక్షణతో తల్లిని కలిసిన అమృత
Mar 15, 2020, 08:36 IST
Pranay Amrutha Met Her Mother With Police Security In Miryalagud - Sakshi
సాక్షి, మిర్యాలగూడ : ఈనెల 8న హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో ఆత్మహత్య చేసుకున్న తిరుగనరు మారుతీరావు కుమార్తె అమృత శనివారం సాయంత్రం తన తల్లి గిరిజను పోలీసుల రక్షణ మధ్య ఇంటికి వెళ్లి కలిసింది. తన తల్లిని కలవాలని, రక్షణ కల్పించాలని ఆమె గతంలో జిల్లా పోలీసులను కోరినట్లు సమాచారం. దీంతో రెడ్డి కాలనీలోని మారుతీరావు నివాసానికి ముందుగా వచ్చిన పోలీసులు వారి బంధువులను, కుటుంబ సభ్యులను ఇంటి పైఅంతస్తుకు పంపించి అనంతరం పోలీసుల రక్షణతో తన తల్లిని కలిసి కొంత సమయం ఆమెతో గడిపింది. కాగా పోలీసులు సమాచారం బయటికి పొక్కకుండా తగు జాగ్రత్త తీసుకున్నారు. 

తండ్రి అంత్యక్రియల వద్ద అమృతకు చేదు అనుభవం..
తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న తర్వాత తండ్రి మృతదేహాన్ని చూడటానికి అంత్యక్రియల సమయంలో పోలీసుల భద్రత నడుమ శ్మశానవాటిక వద్దకు వచ్చిన అమృతను మారుతీరావు కుటుంబ సభ్యులు, బంధువులు అమృత గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేయడంతో పాటు తోపులాట జరిగింది. దాంతో తన తండ్రిని చివరి చూపు చూడకుండానే వెనుదిరిగింది. అంత్యక్రియల అనంతరం అమృత బాబాయి శ్రవణ్‌ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి.  (ఇప్పుడు కథంతా మారుతీరావు ఆస్తుల చుట్టూనే!)

తల్లితో పది నిమిషాలు..
తల్లిని కలిసిన అమృత పది నిమిషాల పాటు ఆమెతో మాట్లాడినట్లు సమాచారం. తన తల్లిని కలిసిన సమయంలో వారి బంధువులను సైతం ఎవ్వరిని వారి వద్ద ఉండనీయలేదు. తండ్రి అంత్యక్రియల అనంతరం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మారుతీ రావు ఆస్తి నాకు అవసరం లేదని, ఆస్తి కోసం తాను ఏ న్యాయ పో రాటం చేయబోనని ప్రకటించడం తెలిసిందే. కాగా తల్లీ కూతుళ్లు ఆ పది నిమిషాలు ఏమి మాట్లాడుకున్నారు..? వారి భ విష్యత్తుపై ఏమైనా చర్చ జరిగిందా..? కేసు వివరాలు చర్చకు వచ్చాయా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా అమృత తన తల్లి గిరిజను కలిసిన సమయంలో బాబాయి శ్రవణ్‌ కూడా ఇంట్లో నే ఉన్నాడని సమాచారం. తల్లీ కూతుళ్ల మధ్యే చర్చలు జరి గాయా..? లేక తన బాబాయితో కూడా మాట్లాడిందా..? అనే వి షయాలు తెలియాల్సి ఉంది. తన తండ్రి మరణానంతరం నా లుగు రోజుల తర్వాత ఊహించని విధంగా తల్లిని కలవడంతో ప ట్టణంలో మరోమారు వీరి విషయం చర్చనీయాంశంగా మారింది.

'అమృత అంటే మారుతీరావుకు చచ్చేంత ప్రేమ'
Mar 10, 2020, 10:31 IST
Maruthi Rao having Lot Of Love On His Daughter - Sakshi
మిర్యాలగూడలో మారుతీరావు మృతదేహం వద్ద విలపిస్తున్న ఆయన భార్య గిరిజ

అమృత వస్తుందనే ఆశతోనే మారుతీరావు ఉండేవాడు

ఇక రాదని తెలిసి.. తిరిగిరాని లోకాలకు

సాక్షి, మిర్యాలగూడ : కూతురు అమృత అంటే మారుతీరావుకు చచ్చేంత ప్రేమ.. ఆమె కోసం పడరాని పాట్లు పడ్డాడు. జైలు జీవితం గడిపినా.. శిక్ష పడుతుందని తెలిసినా.. కూతురు తనవద్దకు వస్తుందనే ఆశతోనే ఉండేవాడని ప్రతి ఒక్కరి నోళ్లలో ఇదే చర్చ. ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తిరునగరు మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా ఆయన ఇంటి వద్ద గుమిగూడిన ప్రజల నోళ్లలో కూతురు అమృత తన వద్దకు వస్తుందని ఎదురు చూశాడనే చర్చించుకుంటున్నారు.


మారుతీరావు మృతదేహం వద్ద ఆయన భార్య గిరిజ ఏడుస్తూ కూడా అమృత తన వద్దకు వస్తుందనే ఎదురు చూసి.. ఇక రాదని తెలిసి ఇలా చేశాడని రోదించింది. చనిపోయే సమయంలో రాసిన సూసైడ్‌ నోట్‌లో కూడా “ గిరిజా క్షమించు.. అమృత.. అమ్మ వద్దకు వెళ్లు’ అని రాసిన లెటర్‌ మారుతీరావుకు కూతురుపై ఉన్న ప్రేమను తెలియజేస్తుందని చర్చించుకున్నారు. ప్రణయ్‌ హత్య కేసుకు సంబంధించిన న్యాయవాది కూడా కూతురు కోసం వేచి చూశాడని పేర్కొన్నారు. శిక్ష తప్పనిసరిగా పడుతుందని తెలిసినా కూతురు తన వద్దకు వస్తే చాలని మారుతీరావు భావించినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

ఇష్టమైన గారెలు తిని..
మారుతీరావుకు గారెలంటె ఇష్టమని, చివరి క్షణంలో వాటిని తిని చనిపోయాడని మృతదేహం వద్ద బంధువులు విలపించారు. మిర్యాలగూడలోనే తన వ్యాపారాలు చేసుకుంటూ ఉండే మారుతీరావు న్యాయవాదిని కలిసేందుకు హైదరాబాద్‌ వెళ్లి తిరిగి రాలేదని ఆయన భార్య గిరిజ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.  

Friday, March 13, 2020

తల్లి, భర్త మోసం.. నవవధువు ఆత్మహత్య

తల్లి, భర్త మోసం.. నవవధువు ఆత్మహత్య

Mar 14, 2020, 07:26 IST
Bride Commits End Lives in Hyderabad - Sakshi
వందన పెళ్లినాటి ఫొటో

మీర్‌పేట: భర్త, తల్లి ప్రవర్తన వల్ల మానసిక వేదనకు గురైన ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ యాదయ్య తెలిపిన మేరకు.. మీర్‌పేట అల్మాస్‌గూడకు చెందిన వేలూరి అనిత కొన్నేళ్లుగా భర్త బాబురావుతో విడిపోయి పిల్లలతో కలిసి ఉంటోంది. అనిత క్యాటరింగ్‌ పనులు చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ప్రేమ్‌ నవీన్‌కుమార్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో నవీన్‌కుమార్‌ తరచూ అనిత ఇంటికి వచ్చేవాడు. ఎలాగైనా శాశ్వతంగా ఇద్దరూ కలిసి ఉండాలన్న ఉద్దేశంతో డిగ్రీ మొదటి సంవత్సరం చదివే తన పెద్ద కుమార్తె వందన (19)ను నవీన్‌కుమార్‌కు ఇచ్చి అనిత గత సంవత్సరం డిసెంబరు 1న వివాహం జరిపించింది.


వివాహమైన తరువాత కూడా నవీన్‌కుమార్‌ అనితల వివాహేతర సంబంధం కొనసాగింది.  ఇది గమనించిన వందన విడిగా ఉందామని పలుమార్లు భర్తకు చెప్పగా, ఇంట్లో నుంచి వెళ్లిపోతే తాను చనిపోతానని తల్లి అనిత బెదిరించింది. దీంతో తల్లి మోసం.. భర్త ప్రవర్తన కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురైన వందన గురువారం రాత్రి సూసైడ్‌నోట్‌ రాసి చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి మృతురాలి సోదరి సంజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చాటింగ్, న్యూడ్‌ ఫొటొలంటూ రేట్లు)

Thursday, March 12, 2020

బయటికొస్తున్న మారుతీరావు ఆస్తుల చిట్టా..

బయటికొస్తున్న మారుతీరావు ఆస్తుల చిట్టా..

నల్లగొండ: మారుతీరావు ఆస్తుల చిట్టా బయటికొస్తోంది. మార్కెట్ విలువ ప్రకారం ఆయన ఆస్తులు రూ.200 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మొదట మారుతీరావు కిరోసిన్ డీలర్ వ్యాపారం చేశాడు. తర్వాత రైస్‌ మిల్లుల బిజినెస్.. అనంతరం వాటిని అమ్మి రియల్ ఎస్టేట్‌ వ్యాపారంలోకి దిగారు. శరణ్య గ్రీన్‌ హోమ్స్‌ పేరుతో వంద విల్లాలు విక్రయించారు. హైదరాబాద్‌లో పలు చోట్ల ఐదు ఫ్లాట్స్.. మిర్యాలగూడలో ఓ షాపింగ్ మాల్, ఈదులగూడెంలో మరో షాపింగ్‌ మాల్ ఉన్నాయి.

మారుతీరావు పేరు మీద రెండంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. మిర్యాలగూడ బైపాస్‌లో 22 కుంటల భూమి ఉంది. మిర్యాలగూడలో సర్వే నెం.756లో ఎకరం 2 కుంటల భూమి.. మిర్యాలగూడలో సర్వే నెం.457లో 7 కుంటల భూమి.. దామరచర్లలో 20 ఎకరాల పట్టా భూమి.. బంధమ్, తాళ్లగడ్డ, ఈదులగూడెం, షబానగర్‌, బంగారు గడ్డలో ప్లాట్స్.. మారుతీరావు పేరు మీద 6 ఎకరాల 19 కుంటల భూమి, ఒక స్కూల్ ఉన్నాయి.

హైదరాబాద్ వచ్చే ముందు భార్య గిరిజతో మారుతిరావు చెప్పిన మాటలివి..!
ఆత్మహత్యతో ముగిసిన మారుతిరావు శకం

మిర్యాలగూడ: ప్రణయ్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడు తిరునగరు మారుతి రావు(59) శనివారం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకోగా, ఆదివారం వెలుగు చూసింది. కూతురుపై ప్రేమతో చేతికి రక్తపు మరకలు అంటించుకున్న ఆయన బలవన్మరణం చర్చనీయాంశమైంది. కోర్టు పని ఉందంటూ హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు భార్య గిరిజతో చెప్పిన ఆయన శనివారం తెల్లవారుజామున ఇంటినుంచి కారులో హైదరాబాద్‌కు బయలుదేరాడు.

హైదరాబాద్‌కు చేరుకున్న మారుతిరావు ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్యభవనంలో 306 నెంబర్‌గల రూంను అద్దెకు తీసుకున్నాడు. రూం తీసుకున్న విషయాన్ని భార్యకు ఫోన్‌చేసి చివరిసారిగా చెప్పాడు. కారు డ్రైవర్‌తో గారెలు తెప్పించుకున్న మారుతిరావు గది తలుపులు బిగించుకున్నాడు. ఆ తరువాత భార్య గిరిజ శనివారం సాయంత్రం ఫోన్‌చేయగా, ఎంతకూ ఎత్తకపోవడంతో, కారు డ్రైవర్‌కు ఫోన్‌ చేసింది. అతడు రూం వద్దకు వెళ్లి పిలిచినా పలకపోవడంతో అనుమానించిన భార్య గిరిజ సైఫాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో స్పందించిన పోలీస్‌ ఉన్నతాధికారులు ఖైరతాబాద్‌ పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు ఆర్యవైశ్యభవనం వద్దకు చేరుకొని గది తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో తలుపులు పగులగొట్టి బెడ్‌రూంను పరిశీలించగా, మారుతీరావు విగతజీవిగా పడివున్నాడు. బెడ్‌పక్కన పడివున్న గారెల్లో విషం (పురుగుల మందు) కలిపి ఉన్నట్లుగా గుర్తించి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా నిర్ధారించుకున్న పోలీసులు మారుతిరావు భార్య గిరిజకు ఫోన్‌చేసి సమాచారమిచ్చారు.

దీంతో ఆమె తన మరిది శ్రవణ్‌కుమార్‌ను వెంటబెట్టుకొని ఆదివారం ఉదయం మిర్యాలగూడ నుంచి కారులో సంఘటన స్థలికి చేరారు. మారుతిరావుకు సంబంధించిన సూట్‌కేసును సీజ్‌చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మారుతిరావు ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం మిర్యాలగూడకు మారుతిరావు మృతదేహాన్ని తీసుకురాగా, సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.




ఆస్తులు భారీగా ఉన్నా ఎవరూ కొనేందుకు ముందుకు రాక.. రూ.50 వేల కోసం..
మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులే కారణాలు?



నల్లగొండ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మారుతీరావు ఆత్మహత్యకు ప్రధానంగా మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులే కారణాలని సమీప మిత్రులు, బంధువులు చెబుతున్నారు. మిర్యాలగూడ పట్టణ సమీపంలోని ఈదులగూడెంలో వ్యాపార సముదాయాన్ని విక్రయించగా, తన సోదరుడికి సైతం ఆ ఆస్తిలో వాటా ఉండటం, సంబంధిత నగదు సోదరుడి వద్దకే చేరడం, బ్యాంకు నుంచి నోటీసులు తదితర కారణాలతో ఆర్థిక ఇబ్బందులు పెరిగినట్లు సమీప మిత్రుల ద్వారా తెలిసింది. అమృత ప్రేమ వివాహం, ప్రణయ్‌ హత్య నేపథ్యంలో మారుతిరావు దంపతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. మానసిక ఒత్తిడిని జయించేందుకు మారుతిరావు హైదరాబాద్‌లో చికిత్స సైతం తీసుకుంటున్నారు.

ఇటీవల మానసిక ఒత్తిడి తీవ్రమవడంతో వైద్యుడిని సంప్రదించగా, ఆయన అందుబాటులో లేకపోవడం, మందులు అయిపోవడం, మరోవైపు ప్రణయ్‌ హత్య కేసు విచారణకు రావడం, న్యాయవాదిని మాట్లాడుకునే ప్రయత్నంలో హైదరాబాద్‌కు తిరగడం ఇదిలా ఉంటే ఆర్థికంగా ఖర్చుల కోసం చేతిలో డబ్బులు లేకపోవడం మారుతిరావుకు ప్రధాన ఇబ్బందిగా మారింది. ఆయన పేరిట ఆస్తులు భారీగా ఉన్నా వాటిని విక్రయిస్తే కొనేందుకు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి లేదు.

రూ.50 వేల కోసం తాను ఇబ్బంది పడుతున్నానని, పలువురు మిత్రులతో ఆయన తన బాధను వ్యక్తం చేశారు. కాగా,  మారుతిరావు అంత్యక్రియలు సోమవారం మిర్యాలగూడలో జరగనున్నాయి. ఆయన అంత్యక్రియలకు కూతురు అమృత దూరంగానే ఉండనుంది. అయితే ఆయన అంత్యక్రియలను భార్య గిరిజ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమృత ఇంటికి ఐదుగురు సిబ్బందితో పోలీసులు పూర్తిగా బందోబస్తు కల్పించారు.


ఆదివారం ఉదయాన్నే 8 గంటలకు మనమే అతడి వద్దకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పి...
న్యాయవాది కోసమే హైదరాబాద్‌కు...

నల్లగొండ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రణయ్‌ కేసు నుంచి బయటపడేందుకు న్యాయవాదిని కలిసేందుకు మారుతిరావు హైదరాబాద్‌ వెళ్లినట్టు తెలిసింది. ప్రణయ్‌ హత్య కేసులో గత నెల చివరి వారంలో చార్జిషీట్‌ దాఖలు చేయగా, ఈనెల 3న దానికి సంబంధించిన నోటీసులు మారుతిరావుకు అందడంతో కేసు నుంచి బయటపడేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. మిర్యాలగూడలో న్యాయవాదులు చార్జిషీట్‌ను పరిశీలించిన అనంతరం, కేసు నుంచి బయటపడటం కష్టమని చెప్పడంతో మారుతిరావు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఉరిశిక్ష తప్పదని పలువురు న్యాయవాదులు వారి అభిప్రాయాలను తెలియజేయడంతో, ఇటీవల కోర్టులోనే న్యాయవాది ఎదుట విలపించగా ఓదార్చినట్లు సమాచారం.

స్థానిక న్యాయవాదులతో కాదని, హైదరాబాద్‌లో సీనియర్‌ న్యాయవాదులను సంప్రదించాలనే ఉద్దేశంతోనే శనివారం నగరానికి వెళ్లినట్టు తెలిసింది. శనివారం సాయంత్రం న్యాయవాదిని కలవాల్సి ఉందని, తానున్నచోటికే అతడు వస్తాడని మారుతిరావు డ్రైవర్‌తో చెప్పినట్లు తెలిసింది. శనివారం సాయంత్రానికి న్యాయవాది రాకపోవడంతో, ఆదివారం ఉదయాన్నే 8 గంటలకు మనమే అతడి వద్దకు వెళ్లాల్సి ఉంటుందని మారుతిరావు డ్రైవరుకు శనివారం రాత్రి సమాచారం ఇచ్చాడు.

ఇదొక భాగమైతే తన కుటుంబంలోని ఇతరులకు కూడా వివాహ సంబంధాలు కుదరడం లేదని, సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మారుతీ రావు సోదరుడు ఆరోపించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సోదరుల మధ్య ఆస్తుల పంపకంలో వివాదాలు తలెత్తాయి. వడ్డీ సకాలంలో చెల్లించకపోవడంతో ఎస్‌ఎఫ్‌సీ నుంచి నోటీసులు వచ్చాయి. దీంతో మారుతిరావుకు మానసిక ఒత్తిడి తీవ్రమైనట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు మారుతిరావు వినియోగించిన విష పదార్థానికి సంబంధించిన బాటిల్‌ను తాను ఉన్న మూడో ఫ్లోర్‌ నుంచి బయటికి విసిరేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

నాడు అన్న... నేడు తమ్ముడు
మిర్యాలగూడ టౌన్‌: హైదరాబాద్‌లో శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న తిరునగరు మారుతిరావు సోదరుడు తిరునగరు నాగేందర్‌ కూడా 1987లో ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడలోని ఓ ప్రైవేటు లాడ్జిలో నాగేందర్‌ ఆత్మహత్య చేసుకోగా, 33 ఏళ్ల అనంతరం ఆయన తమ్ముడైన మారుతిరావు ఆత్మహత్యకు పాల్పడడంతో బంధుమిత్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతిచెందిన ప్రాంతాలు వేరే అయినప్పటికీ ఇద్దరూ సొంతూరుకు దూరంగా లాడ్జిల్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇరువురి మరణాలకు కారణాలేవైనప్పటికీ ఒకే కుటుంబంలో పుట్టిన అన్నదమ్ములు అకాల మరణం చెందడం బాధ కలిగించిందని సమీప బంధువులు తెలిపారు. సివిల్‌ సప్లై సబ్‌ కాంట్రాక్టర్‌గా పనిచేసిన నాగేందర్‌ మృతి పట్ట నాడు అనుమానాలు వ్యక్తం కాగా, పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించినట్లు ఆయన బంధువులు తెలిపారు.

Tuesday, March 10, 2020

సుపారీకి 2కోట్ల భూమి విక్రయం

సుపారీకి 2కోట్ల భూమి విక్రయం
ఉగ్రవాది బారీతో మారుతీరావు ఒప్పందం... అతడి ద్వారా రంగంలోకి అస్గర్‌ అలీ

అస్గర్‌తో సుభాష్‌ శర్మకు జైలులో పరిచయం

అతడికే సుపారీ అప్పగించిన అస్గర్‌ అలీ

1,200 పేజీల చార్జిషీట్‌లో పేర్కొన్న పోలీసులు

నల్లగొండ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): తన కూతురు అమృత-ప్రణయ్‌ల వ్యవహారం తెలియగానే.. వారి ప్రేమను మొగ్గలోనే తుంచేయడానికి మారుతీరావు ప్రయత్నించారు. అది కుదరకపోవడంతో.. ప్రణయ్‌పై దాడి, హత్యకు కుట్రపన్నారు. అందుకోసం సుపారీ ఇవ్వాలని నిర్ణయించాడు. ఈ క్రమాన్ని పోలీసులు మంగళవారం కోర్టుకు సమర్పించిన 1,200 పేజీల చార్జిషీట్‌లో పూసగుచ్చినట్లు వివరించారు. మొత్తం 102 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయగా, 50 పేజీల డాక్యుమెంటరీ ఆధారాలను, 25 పేజీల మెటీరియల్‌ ఎవిడెన్స్‌ను కోర్టుకు అందజేశారు. పోలీసుల చార్జిషీట్‌ ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. ప్రణయ్‌-అమృత ప్రేమను జీర్ణించుకోలేని మారుతీరావు, అతడి సోదరుడు శ్రవణ్‌.. ఆదిలోనే ఆ జంటను విడదీసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రేమను మొగ్గలోనే తుంచేయాలని ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ప్రణయ్‌పై శ్రవణ్‌ ఓసారి దాడి చేశాడు.



చివరగా.. ప్రణయ్‌ అడ్డు తొలగించడమే పరిష్కారమనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో సుపారీ (కిరాయి హత్య) కోసం 2,025 గజాల స్థలాన్ని రూ. 2 కోట్లకు విక్రయించారు. మారుతీరావు డబ్బు సమకూర్చుకున్నాక.. తన మిత్రుడు కరీం ద్వారా ఉగ్రవాది బారీని సంప్రదించాడు. అతడి ద్వారా అస్గర్‌అలీ పరిచయం అయ్యాడు. ప్రణయ్‌ హత్య కోసం అస్గర్‌ అలీకి రూ. 15 లక్షలు అడ్వాన్స్‌ ఇచ్చారు. రాజమండ్రి జైలులో తనకు పరిచయమైన బిహార్‌కు చెందిన సుభా్‌షశర్మకు అస్గర్‌ అలీ ఆ పనిని అప్పగించాడు.గణేశ్‌ విగ్రహం కొనేప్పుడే...



తొలుత ప్రణయ్‌ను 2018 సెప్టెంబరు 12న వినాయకచవితి సందర్భంగా గణేశ్‌ విగ్రహం కొనే సందర్భంలో మిర్యాలగూడలో చంపేయాలని సుభా్‌షశర్మ స్కెచ్‌ వేశాడు. ఆ రోజు అక్కడ రద్దీ అధికంగా ఉండటంతో కుదరలేదు. అదే సమయంలో.. గర్భవతిగా ఉన్న అమృత తన తల్లికి ఫోన్‌ చేసి.. 14వ తేదీన ఆస్పత్రిలో చెక్‌పకు వెళ్తున్నట్లు చెప్పింది. మారుతీరావు ఆ విషయాన్ని బారీకి చేరవేశాడు. దీంతో.. హైదరాబాద్‌లో ఉన్న సుభా్‌షశర్మ హుటాహుటిన మిర్యాలగూడకు చేరుకున్నాడు.



అస్గర్‌అలీ, ఆటోడ్రైవర్‌ నిజాంతో కలిసి ఆటోరిక్షాలో.. సుభా్‌షశర్మ ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి వెళ్లారు. సుభా్‌షశర్మ అదును చూసుకుని ప్రణయ్‌ను కత్తితో నరికి చంపాడు. ఆ తర్వాత ఆ ముగ్గురూ త్రిపురారం మీదుగా నల్లగొండకు వెళ్లారు. సుభా్‌షశర్మ హత్యకు ఉపయోగించిన కత్తిని ఎన్‌ఎ్‌సపీ కెనాల్‌లో పారేశాడు.

స్కూల్‌ డేస్ నుంచే ప్రణయ్-అమృత ప్రేమ... పగతో రగిలిపోయిన మారుతీరావు.. ఛార్జిషీట్‌లో సంచలన నిజాలు

స్కూల్‌ డేస్ నుంచే ప్రణయ్-అమృత ప్రేమ... పగతో రగిలిపోయిన మారుతీరావు.. ఛార్జిషీట్‌లో సంచలన నిజాలు
Samayam Telugu | Updated:Mar 10, 2020, 01:32PM IST

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ హత్యకేసులో పోలీసులు న్యాయస్థానంలో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు 8 మంది నిందితుల పేర్లను అందులో చేర్చారు. మొత్తం 1200 పేజీలతో కూడిన ఛార్జిషీట్‌లో ఏ-1గా మారుతీరావు, ఏ-6గా ఆయన తమ్ముడు శ్రవణ్ కుమార్‌ను చేర్చారు. ఈ కేసులో భాగంగా 102 మంది సాక్షులను పోలీసులు విచారించారు. ప్రణయ్, అమృత ప్రేమ మొదలు నుండి ప్రణయ్ హత్య వరకు ప్రతి ఒక్క అంశాన్ని పూసగుచ్చినట్లు ఛార్జిషీట్‌లో పొందుపరిచారు. మిర్యాలగూడ పోలీసులు వారం రోజుల క్రితమే కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. దీంతో ఈ కేసును న్యాయస్థానం ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బదిలీ చేసింది.

​తొమ్మిదో తరగతిలో ప్రణయ్‌తో ప్రేమ

ప్రణయ్, నేను మిర్యాలగూడ లోని కాకతీయ స్కూల్‌లో చదువుకున్నాం. తాను పదో తరగతి చదువుతున్నప్పుడు నేను జూనియర్‌ని. అక్కడే తనతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. నేను ప్రణయ్‌తో చనువుగా ఉంటున్న విషయం తెలుసుకున్న మా నాన్న.. అతడు తక్కువ కులం వాడు మాట్లాడొద్దు అని హెచ్చరించాడు. ఇంటర్ చేరినప్పుడు నేను ప్రణయ్‌తో మాట్లాడుతున్నానని తెలిసి చదువు మధ్యలో ఆపించి ఇంట్లో నుంచే ప్రైవేటుగా పరీక్షలు రాయించాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని వీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో చేర్పించాడు. ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో కూడా నేను ప్రణయ్ తో మాట్లాడుతున్నానని తెలిసి డిస్ కంటిన్యూ చేయించాడు.

​నాన్న ప్రణయ్ పేరెంట్స్‌ని బెదిరించారు

ఓ రోజు మిర్యాలగూడ రాఘవ్ టాకీ‌స్‌లో నేను, ప్రణయ్ సినిమాకి వెళ్ళినపుడు మా నాన్న, బాబాయ్ శ్రవణ్ అక్కడికి వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళి బాగా కొట్టారు. ప్రణయ్ తల్లిదండ్రులను పిలిచి బెదిరించారు. మా కూతురుతో ప్రేమ వ్యవహారాన్ని ఆపకపోతే ప్రణయ్‌ని చంపేస్తామని హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత ప్రణయ్ నాతో కొద్దిరోజులు దూరంగా ఉన్నాడు. కానీ మేం తరుచూ వాట్సాప్‌లో ఛాటింగ్ చేసుకుంటునే ఉండేవాళ్లం. నాతో మాట్లాడకపోవడాన్ని భరించలేకపోతున్నానని, ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందాం లేకపోతే చచ్చిపోదాం అని నేను ఒత్తిడి తేవడంతో ప్రణయ్ పెళ్లికి ఓకే చెప్పాడు.

​హైదరాబాద్ ఆర్యసమాజ్‌లో పెళ్లి..

2018 జనవరి 30న హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. ఈ విషయం తెలుసుకున్న మా నాన్న మారుతీరావు మిస్సింగ్ కేసు పెట్టాడు. పోలీసులు నన్ను ,ప్రణయ్‌‌ని మిర్యాలగూడ తీసుకొచ్చి ప్రశ్నించారు. ఇద్దరం మేజర్లే కావడంతో నేను ప్రణయ్‌తోనే ఉంటానని పోలీసులతో చెప్పాను. అప్పటి నుండి పగ పెంచుకున్న మా నాన్న ప్రణయ్‌ని అంతం చేస్తానని హెచ్చరించాడు. గర్భం దాల్చిన నన్ను ప్రణయ్ 2018, సెప్టెంబర్ 14 న చెకప్ కోసమని జ్యోతి హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. ఆ సమయంలో కిరాయి హంతకుడితో నా భర్తను మారుతీరావు చంపించాడు.

​పరువు పోయింది.. అందుకే ప్రణయ్ హత్య: మారుతీరావు

తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుని నా కూతురు కుటుంబ పరువు తీసింది. దీంతో సమాజం ఎదుట నేనే తల దించుకోవాల్సి వచ్చింది. స్కూల్ నుంచి వారిమధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ప్రణయ్‌ని మర్చిపోవాలని ఎన్నిసార్లు చెప్పినా నా కూతురు వినిపించుకోలేదు. నా ఇష్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ వెళ్లి అతడిని పెళ్లి చేసుకుంది. తర్వాత కూడా భర్తను వదిలేసి ఇంటికి వచ్చేయాలని బంధువుల ద్వారా రాయబారం నడిపినా అమృత ఒప్పుకోలేదు. నా కూతురిని దూరం చేశాడన్న పగతోనే ప్రణయ్‌ని చంపాలని నిర్ణయించుకున్నాను. దీని కోసం డబ్బు సమకూర్చాలని నా తమ్ముడు శ్రవణ్‌ని అడిగాను. ప్రణయ్‌ను చంపేయాలని సుపారీ కిల్లర్‌ను డబ్బు ఇచ్చాను.

​ప్రణయ్‌ని హత్య చేసేందుకు అన్నయ్య ప్లాన్: శ్రవణ్

అమృత, ప్రణయ్‌ల పెళ్లి కారణంగా మా అన్నయ్య మారుతీరావు సమాజం ముందు తల దించుకున్నాడు. కుటుంబ పరువు పోయింది. దీనికి కారణమైన ప్రణయ్‌ని చంపేయాలని, అందుకు డబ్బు సమకూర్చాలని అన్నయ్య నన్ను అడిగాడు. దీంతో చింతపల్లి క్రాస్ రోడ్ వద్ద ఉన్న ప్లాట్ అమ్మి డబ్బు సమకూరుస్తానని చెప్పాను. తాలకిల విజయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి ప్లాట్ అమ్మాలని నిర్ణయించుకుని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకున్నాం.

​ప్రణయ్‌ని అమృత ఒత్తిడి చేసింది: ప్రణయ్ తండ్రి

స్కూల్‌లో చదువుతున్నప్పటి నుంచే అమృత, ప్రణయ్ స్నేహితులు. ముందుగా అమృతే మా కొడుకుని ప్రేమిస్తున్నానని చెప్పింది. ప్రేమను కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో ప్రణయ్‌ అంగీకరించాడు. పెళ్లికి అమృత తల్లిదండ్రులు అంగీకరించరన్న కారణంగా ఇద్దరూ హైదరాబాద్ వెళ్లిపోయి ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. దీంతో మారుతీరావు, శ్రవణ్ మా కొడుకును చంపేస్తామని అనేకసార్లు బెదిరించారు. మా ఇంటి దగ్గర అప్పుడప్పుడు కొందరు అనుమానాస్పదంగా సంచరించేవారు. అమృత ప్రెగ్నెంట్ అని తెలిశాక జ్యోతి హాస్పిటల్‌కి వెళ్లి వస్తున్న సమయంలో ప్రణయ్ చంపేశారు.

​మారుతీరావు ఆత్మహత్య

ప్రణయ్ హత్యకేసులో ఏ1గా ఉన్న మారుతిరావు ఆదివారం హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు బలమైన ఆధారాలతో ఛార్జిషీటు దాఖలు చేయడంతో తనకు శిక్ష తప్పదని నిర్ధారణకు వచ్చిన ఆయన మనోవేదనతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బెయిల్‌పై బయటకు వచ్చిన మారుతీరావు కూతురు అమృతతో ఎన్నిసార్లు రాజీకి ప్రయత్నించినా ఆమె ఒప్పుకోలేదు. దీంతో వేరే దారిలేక గారెల్లో విషం కలుపుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రణయ్ హత్య కేసులో మారుతీరావుకు బెయిల్... ఆందోళనలో ప్రణయ్ కుటుంబం

ప్రణయ్ హత్య కేసులో మారుతీరావుకు బెయిల్... ఆందోళనలో ప్రణయ్ కుటుంబం
ప్రణయ్ హత్య కేసు : అందరూ అనుకున్నట్లే జరిగిందనీ, అమృతకు న్యాయం జరగట్లేదన్న ఆరోపణలు ప్రణయ్ కుటుంబ సభ్యుల నుంచీ వినిపిస్తున్నాయి.


ప్రణయ్ హత్య కేసులో మారుతీరావుకు బెయిల్... ఆందోళనలో ప్రణయ్ కుటుంబంప్రణయ్, అమృత (File)
NEWS18 TELUGU
LAST UPDATED: APRIL 27, 2019, 11:33 AM IST
SHARE THIS:




Krishna Kumar N
తెలుగు రాష్ట్రాల్లో ప్రణయ్ హత్య కేసు ఓ సంచలనం. ఈ కేసులో అమృత తండ్రి మారుతీరావుకు బెయిల్‌ మంజూరైంది. మారుతీరావుతోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరికి కూడా బెయిల్‌ ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2018 సెప్టెంబర్ 14న నల్గొండ జిల్లా... మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగింది. భార్య అమృతతోపాటు ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా... ఆస్పత్రి బయటే 24 ఏళ్ల ప్రణయ్‌ని కత్తులతో నరికి చంపారు. అమృత తండ్రి తిరునగరి మారుతీరావు... హంతకులకు సుపారి ఇచ్చి ప్రణయ్‌ని హత్య చేయించినట్టు పోలీసులు స్పష్టం చేశారు. నిందితులు ఎప్పటికప్పుడు బెయిల్‌ కోసం పిటిషన్‌లు దాఖలు చేస్తున్నా ఇన్నాళ్లూ కోర్టు తోసిపుచ్చింది. తాజాగా మరోసారి హైకోర్టును ఆశ్రయించగా బెయిల్‌ మంజూరైంది. మారుతీరావు 7 నెలలుగా వరంగల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నారు. ఇప్పుడాయన బెయిల్‌ పేపర్లు జైలు అధికారులకు చేరగానే విడుదల అవుతారు.

ప్రణయ్ హత్య కేసులో మారుతీరావు ప్రధాన నిందితుడు. ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్‌ ఆరో నిందితుడిగా ఉన్నారు. వాళ్లిద్దరితోపాటూ... ఐదో నిందితుడు కరీంపై 2018 సెప్టెంబరు 18న పోలీసులు పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురూ బెయిల్‌పై బయటకు వస్తే ప్రణయ్‌ కుటుంబానికి ప్రమాదమని భావించిన పోలీసులు పీడీ చట్టాన్ని ప్రయోగించారు. అయినప్పటికీ మారుతీరావుకు బెయిల్ రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రియల్టరైన మారుతీరావు... తన పేరు ప్రఖ్యాతుల్ని అడ్డం పెట్టుకొని అక్రమ మార్గంలో బెయిల్ తెప్పించుకున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. బెయిల్ రావడాన్ని నిరసిస్తూ... త్వరలో పైకోర్టుకు వెళ్తారా అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మొత్తానికి పీడీ చట్టం ప్రయోగించినా బెయిల్ రావడంతో... ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Caste killing victim Pranay's wife Amrutha calls out casteists cheering father’s bail

Caste killing victim Pranay's wife Amrutha calls out casteists cheering father’s bail
Amrutha has been posting screenshots and bravely countering people celebrating Maruthi, and Pranay’s death, on ‘Justice for Pranay’ Facebook page.


NEWS BIGOTRY THURSDAY, MAY 02, 2019 - 20:30
Balakrishna Ganeshan Follow @naartthigan

On April 26, news broke that Maruthi Rao, accused of plotting the murder of Pranay, a 24-year-old Dalit man who married Maruthi’s daughter Amrutha, would be released on bail. It did not take long for a section of people to post celebratory messages hailing Maruthi as a ‘legend’ and as a ‘king’ on social media, condoning his alleged caste crime. And when Amrutha, who runs a Facebook page ‘Justice for Pranay’, called these people out, they descended on the page to slut shame and abuse her.


Since the day her father was released, Amrutha has been posting screenshots and bravely countering people celebrating Maruthi, and Pranay’s death, on the Facebook page. In response, people have been posting vile comments. For instance, one user called Devi Sri Prasad Kurella said, “Jai Maruthi Rao... Amrutha has not grown her maturity yet. She's still in some delusion and talking nonsense. She's thinking that sending her father to jail is some great thing. She will face the curse.” He added, “Now she's again saying that she will go to Supreme Court. Alright that's fine, but teach your son tomorrow not to harass any girl when he's in class 9.”

A rumour has been spread online that Pranay and Amrutha were in a sexual relationship since class 9, and that Maruthi Rao once caught them in the act when they were in school. Soon after Maruthi’s arrest, several people justified his actions claiming that despite the immoral act, he had accepted Amrutha.




Several other comments are trolling Amrutha, by commenting “Welcome sir” for Maruthi. One Facebook user Kiran Kumar commented, “Welcome legend but if you had murdered Pranay before the marriage, it would have been even better.”


After Maruthi Rao was released on a bail on April 28, many openly expressed their support and welcomed him as a ‘legend’, ‘tiger’ and ‘king’. A few have even changed their Facebook profile pictures to Maruthi Rao’s photo.

For instance, Pitta Srinivas Reddy, founder president of Reddy Jagruthi, an organisation working for the welfare of Reddy community, wrote on Facebook, “We welcome the release of legend Maruthi Rao wholeheartedly.” He added, “If there are 10 more Maruthi Raos in the society, there would be fear amongst mischief makers who roam around in the name of love.” In the same Facebook post, he hails Maruthi Rao as a 'Hitler' who strikes fear among daughters who intend marry for love. He also threatens couples saying, “The tiger (Maruthi Rao) has come out of his cage. Those who roam around with lust, beware.”

The Facebook page of Reddy Jagruthi has over 18,000 followers, and many of them have endorsed Srinivas’s views.







Many have also shamed Amrutha’s decision to approach the Supreme Court seeking suspension of Maruthi’s bail. One Facebook user said that she should drop such ideas and return to her father.



In the face of this cyber bullying, Amrutha told media on Wednesday, “I am facing a lot of trolling on social media. They are calling Maruthi Rao a ‘legend’ etc., and are proud of his release. I can’t understand how a murder accused is getting so much of support.”

“I will file a cyber complaint against them,” she added.

This is the second time Amrutha is facing harassment. Earlier too, for a remark that “parents don’t intend to give birth to children, they just want to have sex,” she faced a lot of bullying. She withdrew the remarks after harsh criticism.

However, as the torrent of abuse continued, she filed a cyber complaint against a few of them. A couple of them were arrested for online bullying.

Maruthi Rao was released from Warangal Central Prison on April 28 after the Telangana High Court dropped the Preventive Detention Act invoked against him by the Nalgonda police. Challenging his release, Pranay’s family have decided to approach the Supreme Court.

Read: ‘Will challenge Maruthi Rao bail, there’s threat to our lives’: Pranay’s father to TNM

Monday, March 9, 2020

తీవ్ర ఉద్రిక్తతల మధ్య మారుతీరావు అంత్యక్రియలు

తీవ్ర ఉద్రిక్తతల మధ్య మారుతీరావు అంత్యక్రియలు
తండ్రి కడసారి చూపునకు నోచుకోని అమృత

శ్మశాన వాటికలో ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు

అమ్మ దగ్గరకు వెళ్లలేను.. నా వద్దకొస్తే వదులుకోను

ఆస్తిపై ఆశ లేదు.. అమ్మకు బాబాయితో హాని: అమృత

ఆస్తి కోసమే అమృత నాటకాలు: బాబాయి శ్రవణ్‌

మిర్యాలగూడ అర్బన్‌, మార్చి 9: ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు.. తిరునగరు మారుతీరావు అంత్యక్రియలు సోమవారం మిర్యాలగూడలో జరిగాయి. మారుతీరావు పార్థివదేహాన్ని కడసారిగా చూసేందుకు వెళ్తానని, తనకు రక్షణ కల్పించాలని ఆయన కుమార్తె అమృత పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఆమెను బందోబస్తు మధ్య శ్మశానవాటిక వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అమృతను.. ఆమె బాబాయి కూతుళ్లు, బంధువులు అడ్డుకున్నారు. ‘గో బ్యాక్‌ అమృత’ అంటూ నినాదాలు చేశారు. తోపులాటలో కింద పడిపోబోతున్న అమృతను మహిళా పోలీస్‌ సిబ్బంది పట్టుకున్నారు.



మారుతీరావు అనుచరులు, కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేక నినాదాలతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో..  అమృతను పోలీస్‌ వాహనంలో ప్రణయ్‌ ఇంటికి చేర్చారు. అనంతరం ఆమె అక్కడ విలేకరులతో మాట్లాడారు.  తండ్రి ఆత్మహత్య చేసుకోవడం పట్ల కూతురిగా బాధపడుతున్నానని.. కడసారి చూపు కోసం వెళితే బాబాయి శ్రవణ్‌ కుమార్తెలు తనను గెంటేశారని తెలిపారు. ‘ఒంటరైన అమ్మ వద్దకు వెళ్లలేను.. నావద్దకొస్తే వదులుకోను’ అని పేర్కొన్నారు. తన తండ్రి ఆత్మహత్యపై ప్రశ్నించగా.. మనిషిని చంపించేంత ఽధైర్యం ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వ్యాఖ్యానించారు.



హత్య కేసు వాదించేందుకు సరైన న్యాయవాది దొరక్కపోవడం, ఆస్తి పంపకాలు, డబ్బుల సమస్య, కూతురు దూరమైందన్న బాధ, సుపారీ హంతకుల ఒత్తిడి పెరిగి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని  అభిప్రాయపడ్డారు. ప్రణయ్‌ని చంపినందుకు చట్టబద్ధంగా శిక్షపడితే సంతోషించేదాన్నని, ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని కోరుకోలేదని చెప్పారు. ప్రణయ్‌ మృతినే తట్టుకున్న తాను తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేనా అని అమృత ప్రశ్నించారు. తనకు అండగా నిలిచిన ప్రణయ్‌ కుటుంబాన్ని వీడి వారితో (మారుతిరావు కుటుంబం)కలిసి ఉండనని తేల్చిచెప్పారు. భర్తను కోల్పోయి తనలాగే ఒంటరైన తల్లి తన వద్దకు వస్తానంటే ఆమెతో కలిసి వేరే చోట ఉండి సూసైడ్‌నోట్‌లో రాసిన తండ్రి చివరి కోరిక తీరుస్తానన్నారు.



తన బాబాయి ముఖంలో అన్నను పోగొట్టుకున్న బాధ కనిపించలేదని.. ఆయనతో తన తల్లి ప్రాణానికి ముప్పు ఉండొచ్చని ఆందోళన వెలిబుచ్చారు. మారుతీరావు ఆస్తులపై ఆశ లేదని స్పష్టం చేశారు. ప్రణయ్‌ హత్య తర్వాత తల్లి తనతో బాబు పుట్టాక మాట్లాడారని.. బాబును చూపించాలని కోరితే నిరాకరించానని, ఆ తర్వాత మళ్లీ తాము మాట్లాడుకోలేదని తెలిపారు. ఇక.. తండ్రి ఆస్తి కోసమే అమృత కొత్త నాటకాలు మొదలుపెట్టిందని ఆయన బాబాయి శ్రవణ్‌ ఆరోపించారు. నిన్నటి వరకు తండ్రి చావును కోరుకున్న అమృతకు ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రేమ పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు.



తన వల్ల ఎవరికైనా అపాయముందంటే కోర్టు విధించే ఏ శిక్షకైనా సిద్ధమేనని అన్నారు. మారుతీరావుకు సంబంధించిన ఒక్క పైసా కూడా తనకు అవసరం లేదని, ఎవరైనా అప్పున్నట్లు కాగితాలు చూపిస్తే తీరుస్తానని పేర్కొన్నారు. దశదిన కర్మలు పూర్తయ్యాక వచ్చి ఆస్తి, లెక్క చూసుకోవచ్చన్నారు. కాగా.. మారుతీరావు ఆత్మహత్యపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా డ్రైవర్‌ను, మారుతీరావు కుటుంబసభ్యులను విచారించేందుకు సిద్ధమయ్యారు.



అమృతకు స్వల్ప అస్వస్థత

మిర్యాలగూడ అర్బన్‌: తండ్రి పార్థివదేహాన్ని చూసేందుకు శ్మశానవాటిక వద్దకు వెళ్లొచ్చిన తర్వాత.. మీడియాతో మాట్లాడే క్రమంలో అమృత అస్వస్థతకు గురైంది. సోమవారం రాత్రి ఒక చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఆమె స్పృహతప్పింది. వెంటనే ఆమెను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆమె పూర్తిస్థాయిలో కోలుకున్నాక వైద్యులు ఆమెను ఇంటికి పంపించారు. సోమవారం ఏకధాటిగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఆమె లోబీపీకి గురైనట్టు సమాచారం.

తినడానికి రొట్టెలడిగిన తండ్రి.. దాడి చేసిన కొడుకులు

తినడానికి రొట్టెలడిగిన తండ్రి.. దాడి చేసిన కొడుకులు

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): తినడానికి రొట్టె అడిగాడని తండ్రిపై ఇద్దరు కొడుకులు దాడిచేసి గాయపరిచిన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌2 లోని సాగర్‌ సొసైటీని ఆనుకుని ఉన్న గుడిసెల్లో భాగయ్య అనే వ్యక్తి తన కొడుకులు శ్రీను, రాజులతో కలిసి ఉంటున్నాడు. కొంతకాలంగా ఇద్దరు కొడుకులు తండ్రిని వేధింపులకు గురిచేస్తున్నారు. ఆదివారం తినేందుకు బాగయ్య తనకు అన్నం వద్దని, రొట్టెలు కావాలని కోరాడు. దాంతో కోపంతో ఊగిపోయిన ఇద్దరు కొడుకులు నీకు అన్నం పెట్టడమే ఎక్కువ.. రొట్టెలు కావాలా? అంటూ కర్రతో దాడిచేశారు. తలపగిలిన బాగయ్యను చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు. సోమవారం కోలుకున్న బాగయ్య తన కొడుకులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రణయ్‌ హత్య నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

ప్రణయ్‌ హత్య నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

హైదరాబాద్‌ ఆర్యవైశ్య సత్రంలో ఎలుకల మందు తిని బలవన్మరణం

న్యాయవాదిని కలిసేందుకు హైదరాబాద్‌కు
కారులో కూతురు ఫొటోలు చూస్తూనే రాక
ఆర్యవైశ్య మహాసభ సత్రంలో అద్దెకు గది
గారెల్లో ఎలుకల మందు కలిపి తిని మృతి
మృతదేహం పక్కన సూసైడ్‌ నోట్‌ లభ్యం
అమ్మ వద్దకు రావాలంటూ అమృతకు విన్నపం
ఉరిశిక్ష తప్పదేమోనని తీవ్ర ఆందోళన
సోదరుడు, సుపారీ హంతకుల వేధింపులు?
ఆత్మహత్యకు కారణాలు ఇవేనా?
ప్రణయ్‌ను చంపించడంపై పశ్చాత్తాపంతోనే కావొచ్చు: అమృత


ఖైరతాబాద్‌, నల్లగొండ, మంగళ్‌హాట్‌, మిర్యాలగూడ టౌన్‌, మార్చి 8(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారి, తన కూతురు అమృత భర్త ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు తిరునగరి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ఆర్యవైశ్య మహాసభ సత్రం గదిలో ఆదివారం ఉదయం అతడు విగతజీవిగా పడివుండగా కనుగొన్నారు. గారెల్లో ఎలుకల మందు కలుపుకొని తిని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. భార్య గిరిజను క్షమించమని వేడుకొంటూ కూతురు అమృతను అమ్మ వద్దకు వెళ్లాలని కోరుతూ సూసైడ్‌ నోట్‌ రాశాడు. పోలీసులు, ఆర్యవైశ్య సత్రం సిబ్బంది, మారుతీరావు కారు డ్రైవర్‌ రాజేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. న్యాయవాదిని కలిసేందుకు శనివారం సాయంత్రం 6:40 గంటలకు మిర్యాలగూడ నుంచి తన కారులో మారుతీరావు హైదరాబాద్‌కు బయలుదేరాడు. మధ్యలో ఎక్కడా వాహనాన్ని ఆపొద్దని డ్రైవర్‌ రాజేశ్‌కు చెప్పాడు. దారిపొడవునా కూతురు అమృత ఫొటోలను చూస్తూ ఉండిపోయాడు.



చింతలబస్తీలోని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యాలయం వద్ద కారును ఆపి.. ముందుగా బుక్‌ చేసుకున్న పైఅంతస్తులోని 306 నంబరు గదిలోకి వెళ్లాడు. కొద్దిసేపటికి తర్వాత బయటకు వచ్చిన ఆయన, తాను తినేందుకు హోటల్‌ నుంచి గారెలను, అలాగే కారులో ఉన్న కోర్టు పేపర్లను తీసుకురావాలని రాజేశ్‌కు పురమాయించి తెప్పించుకున్నాడు. గారెలు తిన్న అనంతరం రాజేశ్‌ను కారులోనే పడుకోమని చెప్పి తాను గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఆదివారం ఉదయం 6 గంటలకు ఒకసారి, తిరిగి 7.30 గంటల ప్రాంతంలో మరోసారి రాజేశ్‌ గది తలుపులు తట్టగా మారుతీరావు తీయలేదు. ఆ సమయంలోనే భార్య గిరిజ ఫోన్‌ చేసినా మారుతీరావు ఎత్తలేదు. డ్రైవర్‌ రాజేశ్‌కు ఆమె ఫోన్‌ చేసి చెప్పడంతో అతడు, సత్రం రిసెప్షన్‌ కౌంటర్‌లో ఉన్న రిసెప్షనిస్ట్‌కు విషయం చెప్పాడు. ఇద్దరూ వెళ్లి తలుపులు గట్టిగా బాదినా తీయకపోవడంతో ఆర్యవైశ్య మహాసభ నిర్వాహకులకు, పోలీసులకు సమాచారమిచ్చారు.



పోలీసులు వచ్చి గది తలుపులను తెరిపించి చూడగా అప్పటికే లోపల బెడ్‌పై మారుతీరావు చలనం లేని స్థితిలో కనిపించాడు. వెంటనే అతడిని 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ఽధ్రువీకరించారు. శనివారం రాత్రే మారుతీరావు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా మిర్యాలగూడ లాయర్లతో పనికాదని హైదరాబాద్‌లో సీనియర్‌ న్యాయవాదిని కలిసేందుకు ప్రత్యేకంగా వచ్చిన మారుతీరావు, లాయర్‌ను కలవకుండానే ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన గదిలో సూసైడ్‌ నోట్‌ లభించింది. అందులో ‘గిరిజా క్షమించు. అమృతా..  అమ్మ దగ్గరకు రా’ అని రాసివుంది. గదిలో తనీఖీ చేసిన పోలీసులు.. అతడి సెల్‌ఫోన్‌, బట్టలు, అతడి కారుకు చెందిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.



అతడు విషం తాగినట్లుగా గదిలో ఎలాంటి ఆధారాలూ లభించలేదు. అయితే, మారుతీరావు వాంతి చేసుకున్నట్లు గుర్తించిన క్లూస్‌టీమ్‌.. ఆ నమూనాలను పరీక్షల కోసం సేకరించారు. మారుతీరావు తోడల్లుడు, కొత్తపేటకు చెందిన రఘు.. కుటుంబసభ్యులతో కలిసి ఘటనాస్థలికి వచ్చారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అక్కడ భర్త మృతదేహాన్ని చూసి గిరిజ సొమ్మసిల్లి పడిపోయారు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన ఆమె.. గుండెలవిసేలా రోదించారు.



భార్య అనుమానించినట్లుగానే..

మారుతీరావు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడని అతడి భార్య గిరిజ ముందే అనుమానించారా? కొన్ని రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు దీన్నే చెబుతున్నాయి. ప్రణయ్‌ హత్యకేసు చివరి దశకు చేరుకోవడం, మిర్యాలగూడ కోర్టులో అతడి తరఫున వాదిస్తున్న న్యాయవాదులు తమ చేతిలో ఏమీ లేదని, తీర్పు అతడికి వ్యతిరేకంగా రావొచ్చునని పేర్కొనడంతో మారుతీరావు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. పైగా ఇటీవలే మారుతీరావుకు చెందిన పాత షెడ్డులో ఓ మృతదేహం కనిపించింది. ఈ నేపథ్యంలో భార్య గిరిజ కొన్నాళ్లుగా అతడిని దగ్గరగా గమనిస్తున్నారు. ఇంట్లోంచి అతడు బయటకు వెళితే తరచూ ఫోన్లు చేస్తూ ఎక్కడున్నారని అడిగి తెలుసుకొనేవారు. అందులో భాగంగానే ఆదివారం ఉదయం ఆరింటికే భర్తకు  ఫోన్‌చేశారు. 



ఉరి తప్పదేమోననే ఒత్తిడితోనే..

కూతురు అమృత ప్రేమ వివాహం ఇష్టం లేని మారుతీరావు, 2018 సెప్టెంబరు 14న ఆమె భర్త ప్రణయ్‌ని కిరాయి హంతకులతో హత్యచేయించాడు. ఈ కేసులో పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లాడు. ఆర్నెల్ల క్రితం బెయిల్‌పై బయటకొచ్చాడు. అప్పటి నుంచి తనను కేసు నుంచి విముక్తి కోసం కూతురుతో అతడు రాయబారాలు సాగిస్తున్నట్లు సమాచారం. సహకరిస్తే ఆస్తిని తన పేర రాస్తానని చెప్పించినా అమృత ససేమిరా అన్నట్లు తెలిసింది. ప్రణయ్‌ హత్య అనంతరం పరిణామాలతో కుటుంబసభ్యుల మధ్య స్పర్థలు ఏర్పడటం, రాజీ కోసం కూతురు సహకరించకపోవడం, రక్తసంబంధీకులంతా దూరమవడం, సమాజంలో ఛీత్కారాలతో మారుతీరావు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. వీటన్నింటికన్నా గతకొన్ని రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలే అతడిని మరింత ఒత్తిడికి గురిచేశాయని అంటున్నారు.



ప్రణయ్‌ హత్య కేసులో నల్లగొండ పోలీసులు పూర్తి ఆధారాలను సేకరించి బలమైన కేసులు నమోదు చేశారు. ఈ కేసుపై ప్రత్యేక కోర్టు శరవేగంగా విచారణ చేస్తోంది. గత నెల చివరి వారంలో చార్జిషీట్‌ దాఖలు చేయగా, ఈనెల 3న దానికి సంబంధించిన నోటీసులు మారుతీరావుకు అందాయి. ఈ క్రమంలోనే కేసు నుంచి బయటపడేందుకు అతడు ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే మిర్యాలగూడలో న్యాయవాదులు చార్జిషీట్‌ను పరిశీలించిన అనంతరం, కేసు నుంచి బయటపడటం కష్టమని, ఉరిశిక్ష కూడా పడొచ్చని చెప్పడంతో మారుతీరావు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఇటీవల కోర్టులోనే న్యాయవాది ఎదుట అతడు విలపించగా, కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేద్దామని ఓదార్చినట్లు సమాచారం.  కాగా ప్రణయ్‌ హత్య అనంతర పరిణామాలతో కుటుంబంలో కలతలు నెలకొన్నాయని.. అతడి కారణంగా  ఇంట్లోని పిల్లలకు పెళ్లి సంబంధాలు కుదరడడం లేదని, సమాజంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అతడి సోదరుడు శ్రవణ్‌ ఆరోపించినట్లు తెలిసింది.



సోదరుడితో అతడికి ఆస్తి తగాదాలు కూడా ఉన్నట్లు సమాచారం. కోర్టు ఖర్చుల కోసం ఆస్తులను విక్రయించేందుకు సిద్ధపడినా ఎవ్వరూ ముందుకు రాలేదని సమాచారం. రూ.50 వేల కోసం తాను ఇబ్బంది పడుతున్నానని, పలువురు మిత్రులతో అతడు తన బాధను వ్యక్తం చేశాడు. కాగా  మారుతీరావు సోదరుడు నాగేందర్‌దీ ఈ తరహా విషాదాంతమే. సివిల్‌ సప్లయి సబ్‌ కాంట్రాక్టరుగా పనిచేసిన ఆయన 1987లో విజయవాడలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు.



రంగుమారిన శరీరం

ఉస్మానియా ఫోరెన్సిక్‌ విభాగం వైద్యులు డాక్టర్‌ సుధాకర్‌ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో మారుతీరావు మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాన్ని భార్య గిరిజకు అప్పగించారు. మారుతీరావు మృతదేహం రంగు మారడాన్ని గుర్తించి, అతడు ఎలుకల మందు తిని మృతి చెందినట్లు ఫోరెన్సిక్‌ వైద్యులు భావిస్తున్నారు. ఎలుకల మందు కారణంగా మృతి చెందిన వారి శరీరం ఎలా అవుతుందో మారుతీరావు బాడీ కూడా అలానే మారిపోయినట్లు ఫోరెన్సిక్‌ వైద్యులు పేర్కొన్నారు. అయితే నివేదిక వచ్చిన తర్వాతే అతడు ఎలా చనిపోయాడనే దానిపై స్పష్టత వస్తుందన్నారు. కాగా మారుతీరావు ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్నామని సైఫాబాద్‌ సీఐ చింతల సైదిరెడ్డి చెప్పారు. విషం తీసుకోవడంతోనే చనిపోయాడా? మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు.



ఆస్తి బదలాయించాలని సోదరుడు శ్రవణ్‌ ఒత్తిడి

ఆస్తుల విషయంలో మారుతీరావుతో అతడి సోదరుడు శ్రవణ్‌ ఘర్షణపడినట్లు తెలిసింది. అకారణంగా తననూ హత్యకేసులో ఇరికించి జీవితాన్ని నాశనం చేశావని, ఒక్కగానొక్క కూతురు దూరం కావడంతో ఆస్తులనంతా తన పేరిట బదలాయించాలని మారుతీరావుపై శ్రవణ్‌ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే జైల్లో ఉన్నప్పుడే మారుతీరావు తన ఆస్తుల్లో కొంత భాగాన్ని భార్య గిరిజ పేరుమీదకు బదలాయించాడు. ఆగ్రహించిన శ్రవణ్‌ జైల్లోనే అతడిపై పలుమార్లు భౌతిక దాడులు చేసినట్లు తెలిసింది. ఇక ప్రణయ్‌ హత్యకు సుపారీ తీసుకున్న సుభాష్‌ శర్మ, అస్గర్‌ అలీ, అబ్దుల్‌ బారీ తరఫువారి నుంచి డీల్‌ కుదుర్చుకున్న డబ్బుల కోసం మారుతీరావుపై వేధింపులు పెరిగినట్లు తెలిసింది.



మారుతీ రావుతో మాటల్లేవు: శ్రవణ్‌

మారుతీరావుకు తనకు మధ్య ఆస్తి వివాదాలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సోదరుడు శ్రవణ్‌ పేర్కొన్నాడు. ఉస్మానియా మార్చురీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడాడు. షేర్ల విషయంలో మారుతీరావుకు తనకు మధ్య గొడవ జరిగినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందన్నాడు. నిరుడు మే 15 నుంచి మారుతీరావుతో తనకు మాటల్లేవని చెప్పాడు. మొదటి నుంచి ఎవరి ఆస్తులు వారి పేర్లపైనే ఉన్నాయన్నాడు.


అంత్యక్రియలకు కూతురు దూరం

మారుతీరావు అంత్యక్రియలు సోమవారం మిర్యాలగూడలో జరగనున్నాయి. అంత్యక్రియలకు కూతురు అమృత దూరంగానే ఉండనుంది. మారుతీరావు అంత్యక్రియలను భార్య గిరిజ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమృత ఇంటి వద్ద ఐదుగురు సిబ్బందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా అమృత ఇంటికి వెళ్లి మీడియా పలకరించగా.. ఆమె ముక్తసరిగా స్పందించింది. మీడియా ద్వారానే తనకు తండ్రి ఆత్మహత్య వార్త తెలిసిందని పేర్కొంది. ప్రణయ్‌ ని హత్య చేయించడంతో పశ్చాత్తాపం (రిగ్రెట్‌) చెంది ఉంటాడని.. అందుకే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అభిప్రాయపడింది.

Friday, March 6, 2020

చెరువులో ముంచి.. కాళ్లతో తొక్కి .. ముగ్గురు కూతుళ్లను చంపేసిన తండ్రి

చెరువులో ముంచి.. కాళ్లతో తొక్కి .. ముగ్గురు కూతుళ్లను చంపేసిన తండ్రి
త్రుటిలో తప్పించుకొన్న  కుమారుడు రయీస్‌

మద్యానికి బానిసై.. భార్య డబ్బివ్వడం లేదనే  కోపంతో దారుణం

బాన్సువాడలో ఘోరంచెరువులో ముంచి.. కాళ్లతో తొక్కి ..

ముగ్గురు కూతుళ్లను చంపేసిన తండ్రి

బాన్సువాడలో ఘోరం

బాన్సువాడ టౌన్‌, మార్చి 6: ‘తెలిసినవాళ్లు దర్గా దగ్గర పండుగ చేస్తున్నరు.. పోయి తినొద్దం’ అని తండ్రి చెబితే ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఆనందంగా అతడి వెంట బయలుదేరారు. మంచి భోజనం పెట్టిస్తానని ఆశపెట్టిన ఆ తండ్రి.. కొద్ది దూరం వెళ్లగానే పిల్లలను ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు. అలా కొట్టుకుంటూనే వారిని చెరువుగట్టు వైపు లాక్కెళ్లాడు. ముగ్గురు కుమార్తెలను బలవంతంగా చెరువు లోపలికి దించి నీళ్లలో ముంచాడు. పాపం పిల్లలు.. ఊపిరాడక తలలు పైకెత్తి, మమ్మల్ని చంపొద్దు అబ్బాజాన్‌ అని వేడుకున్నా ఆ కర్కోటకుడి హృదయం కరగలేదు. ముగ్గురినీ పదే పదే తన కాలితో లోపలికి తొక్కి చంపాడు. ఆ తండ్రి ఉన్మాదం నుంచి కుమారుడు త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్‌ డ్రైవర్స్‌ కాలనీలో శుక్రవారం ఈ ఘోరం చోటు చేసుకుంది. తాగుడుకు బానిసై, భార్య డబ్బులు ఇవ్వడం లేదనే కోపంతో ఇంతటి దారుణానికి ఒడగట్టాడు. బాన్సువాడ డీఎస్పీ దామోదర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.

నిజామాబాద్‌కు చెందిన సయ్యద్‌ ఫయాజ్‌ హుస్సేన్‌కు తాడ్కోల్‌ డ్రైవర్స్‌ కాలనీకి చెందిన నిలోఫర్‌ బేగంతో 2009లో పెళ్లయింది. డ్రైవర్స్‌ కాలనీలో అత్తమామలే ఫయాజ్‌కు ఓ ఇల్లు కట్టించి ఇచ్చారు. ఫయాజ్‌, నిలోఫర్‌ దంపతులకు ఆఫియా బేగం(10), మాహీన్‌ బేగం(9), జోయా బేగం(7), రయీస్‌ పిల్లలు. ఫయాజ్‌ కూలికి వెళుతుండగా, నీలోఫర్‌ టైలర్‌ పని చేస్తోంది. కొంతకాలంగా ఫయాజ్‌ మద్యానికి బానిసయ్యాడు. పనికి వెళ్లడం మానేసి.. తాగుడుకు డబ్బులు ఇవ్వాలని భార్యను కొడుతున్నాడు. కొన్నాళ్లుగా డ్వాక్రా గ్రూపు డబ్బులు తనకు ఇవ్వాలని భార్యను వేధిస్తున్నాడు. గురువారం రాత్రి భార్యతో గొడవపడి అరుస్తూ ఇంటి చుట్టూ ఉన్న మొక్కలను పీకేసి భయోత్పాతం సృష్టించాడు.  శుక్రవారం ఉదయం 10.30 గంటలకు నలుగురు పిల్లలను దగ్గరికి తీసుకున్నాడు.

తెలిసినవాళ్లు కందూరు చేస్తున్నారని, వెళ్లి భోజనం చేసి వద్దామని నమ్మించి వారిని వెంట బెట్టుకొని తాడ్కోల్‌ గ్రామ చెరువు వైపు తీసుకెళ్లాడు. దారి మధ్యలో  తండ్రి కొడుతుండటంతో రయూస్‌ తప్పించుకొని ఇంటికి వచ్చి తల్లికి చెప్పాడు. ఆమె పరుగెత్తుకొని వెళ్లి చూడగా చెరువు గట్టుపై కూతుళ్ల చెప్పులు కనిపించాయి. బిగ్గరగా రోదిస్తూ పక్కన పొలాల్లో పని చేస్తున్నవారిని పిలిచి తన కూతుళ్లను కాపాడాలని ఆమె వేడుకుంది. వారు చెరువులోకి దిగి గాలించగా ముగ్గురు పిల్లల మృతదేహాలు బయటపడ్డాయి. పోలీసులొచ్చి ఘటనపై ఆరా తీశారు. గ్రామంలోని కల్లు కాంపాండ్‌ వద్ద నిందితుడు ఫయాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తల్లి నిలోఫర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఫయాజ్‌ను కఠినంగా శిక్షించాలంటూ నిలోఫర్‌ బంధువులు, బాన్సువాడ పోలీ్‌సస్టేషన్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు.