Wednesday, January 12, 2022

Kerala: భార్యల మార్పిడి రాకెట్‌లో ప్రముఖుల పాత్ర

 Kerala: భార్యల మార్పిడి రాకెట్‌లో ప్రముఖుల పాత్ర

Jan 12 2022 @ 10:13AMహోంప్రత్యేకం


పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన దిగ్భ్రాంతికర వాస్తవాలుతిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో వెలుగుచూసిన భార్యల మార్పిడి రాకెట్ బాగోతంలో పలువురు ప్రముఖుల పాత్ర కూడా ఉందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కేరళ డీజీపీ అనిల్ కాంత్ పర్యవేక్షణలో సీనియర్ పోలీసు అధికారులు ఈ బాగోతంపై దర్యాప్తు చేస్తున్నారు. భార్యల మార్పిడి బాగోతంలో ప్రముఖుల ప్రమేయం కూడా ఉందని తేలింది.భార్యల మార్పిడి బాగోతంలో ప్రభుత్వ ఉద్యోగులు, వృత్తి నిపుణులు, ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలున్నారని దర్యాప్తులో వెల్లడవడంతో పోలీసులే దిగ్భ్రాంతి చెందారు. గత మూడన్నరేళ్లుగా గ్రూపులో తనతో బలవంతంగా శృంగారం చేయించి డబ్బు సంపాదిస్తున్నాడంటూ ఓ గృహిణి భర్తపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ ముఠా సభ్యుల కోసం వేట ప్రారంభించారు.మీట్ అప్ కేరళ, కేరళ కకోల్డ్, రియల్ మీట్ పేరిట సోషల్ మీడియా గ్రూపులుతన భర్త సమ్మతితోనే కొంతమంది వ్యక్తులు తనను లైంగికంగా వేధించారని కొట్టాయం జిల్లాలోని కరుకాచల్ పట్టణానికి చెందిన ఓ గృహిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో 9మంది గ్రూపు సభ్యుల ఫోన్ నంబర్లను కూడా ఇచ్చారు. భార్యల మార్పిడి రాకెట్ సభ్యుల మొబైల్ ఫోన్ల నుంచి రికవరీ చేసిన ఛాట్‌లు, కాల్ వివరాలను విశ్లేషించి 14 సోషల్ మీడియా గ్రూపులను పోలీసులు గుర్తించారు. భర్త మార్పిడి చేసుకోవాలనుకునే వ్యక్తులు ‘మీట్ అప్ కేరళ’, కేరళ కకోల్డ్,రియల్ మీట్ వంటి సోషల్ మీడియా గ్రూపుల్లో చురుకుగా ఉన్నారని పోలీసులు కనుగొన్నారు. ఆసక్తి ఉన్నవారు తమ ఫొటోలను లొకేషన్ వివరాలతో సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో వారి లైంగిక ప్రాధాన్యతలను పంచుకుంటున్నారు.ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఖాతాల్లో రహస్యంగా చాటింగులు...ఈ రహస్య చాట్‌లు ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఖాతాల్లో గోప్యంగా ఉన్నాయని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఈ రాకెట్‌లో కొట్టాయం, పతనంతిట్ట,అలప్పుజా జిల్లాలకు చెందిన వారితోపాటు బాధిత గృహిణి భర్త ఉన్నారు. గృహిణిపై లైంగిక దాడి జరిపిన ముగ్గురి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ముఠాలో ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకుందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఓ భర్తకు గల్ఫ్ దేశంలో ఉద్యోగం రావడంతో ఆయన వెళ్లి పోవడంతో అతని భార్య గ్రూపులో చేరిందని వెల్లడైంది. ఈ గ్రూపులో ఇతరులతో శృంగారం చేస్తున్న వీడియోను చిత్రీకరించి, దాన్ని కుటుంబసభ్యులకు పంపుతామని బెదరించి ఈ బాగోతాన్ని సాగించారని పోలీసులు చెప్పారు. 


ఇవి కూడా చదవండిImage Captionపంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీకి బంధువు షాక్కేరళ సైబర్ పోలీసు విభాగం దర్యాప్తు భార్యల మార్పిడి ముఠా జంటలు వారి ఇళ్లు లేదా మరెక్కడైనా సామాజికంగా కలుసుకొని సమూహంగా శృంగారంలో నిమగ్నమవుతుంటారని తమ దర్యాప్తు వెల్లడైందని ఓ పోలీసు అధికారి చెప్పారు. ఈ భార్యల మార్పిడి జంటల సోషల్ మీడియా ఖాతాలను సైబర్ పోలీసు విభాగం సిండికేట్ ట్రాక్ చేస్తుందని పోలీసులు తెలిపారు. ఈ గ్రూపుల్లో యాక్టివ్ మెంబర్‌లలో గోవా, తమిళనాడు, ఎన్‌ఆర్‌ఐలు, టెక్కీలు, ప్రభుత్వ ఉద్యోగులు, కేరళలోని ఇతర ఉన్నత స్థాయి నిపుణులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎన్నారై తన భార్యతో సహా సౌదీ అరేబియాకు వెళ్లిపోయాడు. దీంతో కేరళ పోలీసులు అతన్ని స్వదేశానికి రప్పించే ప్రక్రియను ప్రారంభించారు. 


No comments:

Post a Comment