Wednesday, July 10, 2019

అవసరానికి తగ్గ కోర్సులే వుండాలి

అవసరానికి తగ్గ కోర్సులే వుండాలి
బడుల మూత

4000 బడుల మూత?
10-07-2019 03:30:48

3500 ప్రాథమిక పాఠశాలలు
500 ఉన్నత పాఠశాలలు
విద్యార్థులు, టీచర్లు ఇతర స్కూళ్లకు
టీఆర్టీ నియామకాలు కాగానే ప్రక్షాళన
విద్యార్థులు లేని బడులకు కోత
మూసివేతకు రాజస్థాన్‌ ఫార్ములా
సర్కారుకు నేడు అధికార్ల నివేదిక
త్వరలో టీచర్ల సంఘాలతో భేటీ
పదోన్నతుల తర్వాతే టీఆర్‌టీ నియామకాలు
పలు ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌
హైదరాబాద్‌, జూలై 9(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 4 వేలకు పైగా ప్రభుత్వ బడులు మూతపడనున్నాయి. సరిపడా విద్యార్థులు లేని బడులను మూసివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రాజస్థాన్‌ ఫార్ములాను అనుసరించనున్నారు. ఐదుగురు సభ్యుల అధికారుల బృందం ఇటీవల రాజస్థాన్‌లో పర్యటించింది. అక్కడ ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి? ఎన్ని మూసివేశారు? ఏ అంశం ఆధారంగా మూసివేశారు? వంటి విషయాలపై ఈ బృందం అధ్యయనం చేసింది. పూర్తి నివేధికను బుధవారం ప్రభుత్వానికి అందించనుంది. రాజస్థాన్‌లో 2015 నుంచి ఇప్పటి వరకు నాలుగేళ్లలో 20 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు. 30 మంది కన్నా తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను మూసివేసినట్లు మన అధికారులు గుర్తించారు. ఇక్కడ కూడా అదే ఫార్ములాను అమలు చేయనున్నారు. మూసివేసే బడుల్లో ఉన్న విద్యార్థులు, టీచర్లను ఇతర పాఠశాలలకు తరలిస్తారు. రోజూ దూరంగా ఉన్న పాఠశాలకు వచ్చే విద్యార్థులకు రవాణా చార్జీలను ప్రభుత్వం చెల్లిస్తుంది. టీచర్లను అవసరం ఉన్న పాఠశాలలకు డిప్యుటేషన్‌ మీద పంపిస్తారు.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


టీఆర్టీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత బడుల మూసివేతకు శ్రీకారం చుడతారు. ఇప్పటికే అన్ని జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. 10 మంది విద్యార్థుల లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల వివరాలను, 30 మంది లోపు ఉన్న ఉన్నత పాఠశాలల వివరాలను అందించాలని ఆదేశాలిచ్చారు. ఇప్పటికే కొన్ని జిల్లాలు సమాచారాన్ని అందించగా, మరికొన్ని జిల్లాలు కసరత్తు చేస్తున్నాయి. బడుల మూసివేతకు ఓవైపు అంతర్గత చర్యలు చేపడుతూనే పైకి మాత్రం అలాంటిదేమీ లేనట్లే వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ ఉపాధ్యాయ సంఘం నాయకుడు పాఠశాల విద్యా కమిషనర్‌ను రాజస్థాన్‌ పర్యటనపై ఆరా తీయగా... త్వరలోనే ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని, అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. టీఆర్టీ నియామకాలు కూడా ఎక్కువ విద్యార్థులు, తక్కువ టీచర్లు ఉన్న పాఠశాలల్లో మాత్రమే చేపట్టనున్నారు. దీంతో టీఆర్టీ నియామకాల తర్వాత బడుల రేషనలైజేషన్‌ చేసినాఇబ్బంది ఏమీ ఉండదని అధికారులు తెలిపారు. మూసివేతపై త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించనున్నారు.

4 వేల స్కూళ్లకు ముప్పు...
తెలంగాణలో 26,040 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 18,217 ప్రాథమిక పాఠశాలలు, 3,186 ప్రాథమికోన్నత పాఠశాలలు, 4,637 ఉన్నత పాఠశాలల ఉన్నాయి. 27.73 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. బడులను మూసివేయాలనే విద్యాశాఖ నిర్ణయంతో తెలంగాణలో సుమారు 4 వేల పాఠశాలలకు మూసివేత ముప్పు వాటిల్లనుంది. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 3500 వరకు ఉండగా, ఉన్నత పాఠశాలలు 500 వరకు ఉండే అవకాశం ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో 10 కన్నా, ఉన్నత పాఠశాలల్లో 30 కన్నా తక్కువ విద్యార్థులున్న పాఠశాలలపై వేటు పడనుంది. 2018-19 విద్యా సంవత్సరంలో 3445 ప్రాథమిక పాఠశాలల్లో, 22 ఉన్నత పాఠశాలల్లో 1-15 మంది విద్యారులున్నారు. 14138 ప్రాథమిక పాఠశాల్లో, 1397 ఉన్నత పాఠశాలల్లో 16-100 మంది విద్యార్థులు ఉన్నారు. కనీసంగా 4వేల పాఠశాలలు మూతపడే అవకాశాలు కనిపించాయి. 2017-18 లెక్కల ప్రకారం 793 పాఠశాలల్లో విద్యార్థులే లేరు. వీటిలో 779 ప్రాథమిక పాఠశాలలు కాగా 11 ప్రాథమికోన్నత, 3 ఉన్నత పాఠశాలల ఉన్నాయి. 1544 పాఠశాలల్లో 1-10 మంది విద్యార్థులున్నారు. వీటిలో వీటిలో ప్రాథమిక పాఠశాలలు 1510 కాగా, ప్రాథమికోన్నత పాఠశాలలు 30, ఉన్నత పాఠశాలలు 4 ఉన్నాయి. 3,252 పాఠశాలల్లో 11-20 మంది విద్యార్థులున్నారు. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 3,13, ప్రాథమికోన్నత పాఠశాలలు 96, ఉన్నత పాఠశాలలు 22 ఉన్నాయి. వీటితో పాటు 3681 పాఠశాలల్లో 21-30 మంది విద్యార్థులున్నారు. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 3420, ప్రాథమికోన్నత పాఠశాలలు 217, ఉన్నత పాఠశాలలు 44 ఉన్నాయి.


బడుల మూత మానుకోవాలి
మంత్రి జగదీశ్‌రెడ్డికి విద్యా పరిరక్షణ కమిటీ విజ్ఞప్తి

ఈనాడు, హైదరాబాద్‌: విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నదని చెప్పి ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం, ఉపాధ్యాయ ఖాళీలను తగ్గించే చర్యలను మానుకోవాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని కోరింది. కమిటీ ప్రతినిధుల బృందం శుక్రవారం మంత్రిని కలిసి వినతిపత్రం అందించింది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం, ఇతర సమస్యల గురించి న్యాయమూర్తి, విద్యావేత్తలతో కమిటీ వేయాలని ప్రతినిధులు సూచించారు. పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని, పిల్లలకు ఉదయం, సాయంత్రం అల్పాహారం ఇచ్చి...హోం వర్క్‌ని పాఠశాలలోనే చేయించాలని, ప్రైవేట్‌ బడులను నియంత్రించాలని కమిటీ ప్రతినిధులు మంత్రికి సూచించారు. దీనికి స్పందించిన జగదీశ్‌రెడ్డి ..తమ పరిధిలో చేయగలిగినవన్నీ యుద్ధ ప్రాతిపదికన చేస్తామని తెలిపారు. మూసివేతలపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఏ నిర్ణయమైనా ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలతో చర్చించిన తర్వాతే తీసుకుంటామన్నారు.

‘అమ్మఒడి’తో సర్కారీ బడుల మూత?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Published Tuesday, 25 June 2019
పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో రూ.15 వేలు జమచేసేలా ‘అమ్మఒడి’ పథకం అమలు చేస్తానని వైకాపా అధినేత జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన అనంతరం ఆ హామీని అమలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఆలోచన మేరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలందరికీ ‘అమ్మఒడి’ వర్తింపజేస్తామని అధికారులు ప్రకటించారు. పేదవర్గాల తల్లిదండ్రులకు ఇదొక వరమే. ఇది ప్రభుత్వానికి అదనపుభారం అని చాలామంది అనుకోవచ్చు. అయితే, కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ఒక్కో జిల్లాకు రూ.300- 400 కోట్ల వరకు నిధులు విడుదలవుతాయి. ఆ లెక్కలను సమగ్రంగా పరిశీలిస్తే ఏ ఒక్క జిల్లాలో కూడా పూర్తిస్థాయిలో పాఠశాలలకు గ్రాంట్లు వినియోగించిన దాఖలాలు లేవనే చెప్పవచ్చు. అలాంటప్పుడు ఆ నిధులను అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థులకు వినియోగించుకునే అవకాశం లేకపోలేదని నిపుణుల అభిప్రాయం. అమ్మఒడి పథకాన్ని ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకూ వర్తింపజేయడం వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల మనుగడ కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాహక్కు చట్టప్రకారం దారిద్య్రరేఖకు దిగువన వున్న 25 శాతం విద్యార్థులను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చుకోవాల్సి వుంది. ప్రైవేటు పాఠశాలల్లో చదివే ఆ 25 శాతం మందికే ‘అమ్మఒడి’ని వర్తింపజేస్తే బాగుంటుందన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపే మధ్యతరగతి కుటుంబీకులైతే తాము చెల్లించే ఫీజులకు కొంత డబ్బు కలిసొస్తుందని ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గుచూపే అవకాశాలు లేకపోలేదు. పట్టణాలు, నగరాల్లో వున్న ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అమ్మఒడి ద్వారా అందే మొత్తం ఫీజులకు చాలకపోవచ్చు. గ్రామీణ స్థాయిల్లో ప్రైవేటు పాఠశాలల్లో ఏడాదికి రూ. 15వేలకే ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదివించే వారు లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1700 కంటే ఎక్కువగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తగినంత మంది విద్యార్థులు లేక ఇప్పటికే చాలా పాఠశాలలు మూతపడి, లక్షలు విలువ చేసే భవనాలు నిరుపయోగంగా వున్నాయి. చాలా ప్రాంతాల్లో 10 నుంచి 20 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు లేకపోలేదు. అమ్మఒడి పథకం ద్వారా లభించే నగదు ప్రోత్సాహకాలతో గ్రామీణ ప్రాంతాల వారు తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలల్లో చేర్చించే పరిస్థితి వుంది. ఈ నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని ప్రాథమిక పాఠశాలలు మూతపడే అవకాశాలు లేకపోలేదు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చెబుతున్నారు. అయితే, అమ్మఒడి పథకం వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూతపడే అవకాశాలున్నందున ముఖ్యమంత్రి ఆశయం ఎలా నెరవేరుతుంది?


ఏపీలో 9,200 సర్కార్ బడుల మూత?

Wed,August 1, 2018 12:22 AM
9200 Sarkar boxes lid in AP
-హేతుబద్ధీకరణ పేరుతో స్కూళ్ల విలీనం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: విద్యార్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో ఏపీలో ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధమవుతున్నది. ఈ ఏడాది దాదాపుగా 9,200 స్కూళ్లను మూసివేసేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నట్టు తెలిసింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటున్నదని, వాటిని పక్కనున్న ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేయాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. గత ఏడాది ఇదే కారణంతో దాదాపు 4 వేల స్కూళ్లను మూసేసింది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను గుర్తించే పనిని ఉపాధ్యాయులకు అప్పగించిన ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలలను ఎత్తివేసి ఉన్నతపాఠశాలల్లో విలీనం చేసేందుకు చర్యలు చేపట్టినట్టు సమాచారం. గత ఏడాది విద్యార్థుల సంఖ్య 30 కంటే తక్కువగా ఉన్న పాఠశాలలను మూసివేసిన ప్రభుత్వం ఈ ఏడాది 60 కంటే తక్కువగా ఉన్నవాటిసి మూసివేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. 60 కంటే తక్కువగా ఉన్న పాఠశాలలు ఏపీలో 17,690 ఉన్నట్టు విద్యాశాఖాధికారులు ప్రభుత్వానికి నివేదించినట్టు తెలుస్తున్నది. విద్యాశాఖ నిర్ణయం ప్రకారమైతే ఈ పాఠశాలలన్నీ మూతపడే అవకాశాలున్నాయి.

No comments:

Post a Comment