కాపురాల్ని కూల్చుతున్న కొత్త సమస్య ఇగో .. ఇద్దరూ ఉద్యోగస్తులైతే..
7/31/2019 10:36:22 AM
ఇగోతో.. తెగుతున్న బంధాలు
ఆనందాల స్థానంలో ఘర్షణ వాతావరణం
ఎవరికి వారే తానేమీ తక్కువ కాదనే అహం
పెరుగుతున్న నెగిటివ్ ఆలోచనా ధోరణి
తగ్గిన సర్దుకునే గుణం
హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): ఇగో.. ఇది మనిషిలోని మానవత్వాన్ని మంటగలుపుతుంది. ఇది పట్టింపులు పెరిగి మనుషుల మధ్య దూరాన్ని పెంచుతోంది. ఆనందంగా సాగాల్సిన కాపురం కలహాల కాపురంగా మారుతుంది. ఎవరికి వారు తానేమీ తక్కువ కాదనే ధోరణితో వ్యవహరిస్తుండడంతో పట్టింపులు మరింత పెరుగుతాయి. ఈ మధ్య కాలంలో ఇది దంపతుల మధ్య దూరాన్ని పెంచి వారి కాపురాలను కూల్చేస్తోంది. ఇద్దరి మధ్య ఇగోలు చోటు చేసుకోవడానికి కొన్నిసార్లు సమాజ పరిస్థితులు కారణమవుతున్నాయి. ప్రధానంగా ఆర్థిక అంశాలే వీటిని పెంచి పోషిస్తున్నాయి. ఆర్థికంగా ఎదుగుతుండడంతో కొందరిలో ఇగోలు పెరుగుతున్నాయి.
దెబ్బతింటున్న అహం
ఒకే జనరేషన్‌లో ఆర్థిక అసమానతలు చోటు చేసుకుంటుండడంతో కింది దశలో ఉన్న వారిలో అహం దెబ్బతింటోంది. సమాజంలో ఇతరులు ఉన్నతులుగా ఉంటుండడం, తాము ఆ స్థాయికి ఎదగలేకపోవడం మనసుపై ప్రభావం చూపుతోంది. రెండు రకాల వ్యక్తులు ఒకచోట కలిస్తే మరొకరిలో ఇగో పెరుగుతుంది. తమను చిన్న చూపు చూస్తున్నారనే భావన వారిలో ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలో చిన్నమాట ఎవరైనా అంటే చాలు.. ఒక్కసారిగా రియాక్ట్ అవడం చాలా ఎక్కువగా ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.
నెగిటివ్ ఆలోచనలతోనే
చాలా మందికి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎవరైనా ఏమైనా అంటే దానిని నెగిటివ్‌గా ఆలోచించి వారిపై ఇగో పెంచుకుంటున్నారు. దీంతో ఇరువురి మధ్య మనస్పర్థలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ తరహా అంశాలు భార్యాభర్తల మధ్య చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఆర్థికంగా బాగా ఉన్న సమయంలో విలాసంగా బతికేవారి కుటుంబ పరిస్థితి తారుమరు అయితే తట్టుకోలేని పరిస్థితులకు చేరుతున్నారు. విలాసాలకు చెక్ పెడుతుండడంతో కుటుంబంలో తరచూ తగాదాలు ఏర్పడుతున్నాయి. అంత వరకు బాగా బతికిన కుటుంబం ఒక్కసారిగా చితికిపోవడంతో సమాజంలో తమకు స్టేటస్ తగ్గిందనే ఆత్మన్యూనతా భావం వారిలో ఏర్పడుతుంది. దీనికి కారణం నువ్వేనంటూ భార్యాభర్తలిద్దరూ పరస్పరం నిందించుకోవడం పరిపాటిగా మారింది. ఆ తర్వాత ఇది మరింత పెరిగి ఆత్మహత్యలకు దారి తీస్తోంది. తల్లిదండ్రులను ఎదురించి పెళ్లి చేసుకున్న కుటుంబాల్లో కూడా ఇరువురి మధ్య దూరం పెరిగిపోయే పరిస్థితి కనిపిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. పెళ్లి చేసుకుని మంచిగా బతకాలనే ఆశతో పెళ్లి చేసుకున్న దంపతులకు అనుకున్నట్లుగా పరిస్థితులు లేకపోవడంతో ఇటువంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని వైద్యులు తెలిపారు.
తగ్గిన కమ్యూనికేషన్
భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ సైతం బాగా తగ్గిపోతోంది. ఇరువురు ఉద్యోగులు అయితే వారి మధ్య దూరం మరింత పెరిగి కలిసి కూర్చుని మాట్లాడుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అవసరమైతే పొడి పొడి మాటలు తప్ప, అన్యోన్యంగా పలకరించుకునే పరిస్థితులు కనిపించడం లేదని వైద్యులు పేర్కొంటున్నారు.
ఒకే ఇంటిలో ఉన్పప్పటికీ ఎవరికి వారే ఉన్నట్లుగా ఉంటున్నారు. ఎక్కువగా ఫోన్లతోనే సవ్గుయం గడుపుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.
ఇద్దరు పనిచేయడం..
భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తుండడంతో వారిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో పురుషుడు ఉద్యోగం చేసే వారు, భార్య ఇంటి విషయాలు చూసుకునేలా ఉండేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇరువురు ఉద్యోగం చేస్తుండడంతో భార్యను ఇంటి మనిషిగా చూస్తుండడంతో ఆమె తట్టుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. నేనూ సంపాదిస్తున్నానే ఇగో ఇద్దరిలో పెరిగి గొడవలకు దారి తీస్తోంది. ఒకవైపు ఆఫీసు పని, మరోవైపు ఇంటి పనులతో గృహిణి ఒత్తిడికి గురవుతోంది. అన్ని పనులు నేనే ఎందుకు చేయాలి.. ఆయన కూడా చేయొచ్చు కదా.. అనే భావన ఏర్పడి ఇగోతో గొడవలు పడుతున్నారు.
మాట్లాడుకునే సమయం లేక..: సుజాత రమణి, సైకాలజిస్టు, కిమ్స్ ఆస్పత్రి
భార్యాభర్తలు పూర్తిగా మాట్లాడుకోవడం లేదు. ఇద్దరి మధ్య అవినాభావ సంబంధాలు పెద్దగా ఉండడం లేదు. ఏదో మొక్కుబడిగా ఉన్నామా.. అంటే ఉన్నాం.. అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకునే సమయం ఇద్దరి మధ్య ఉండడం లేదు. దీంతో పరిష్కారించుకోవాల్సిన సమస్యను పెద్దవి చేస్తుండడంతో ఘర్షణ పెరుగుతోంది. దీంతో ఇద్దరి మధ్య ఇగో అడ్డం వస్తోంది. భార్యాభర్తల మధ్య ఒత్తిడి పెరిగి ఇగోలతో రాజీకి రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇది క్రమేణా మనస్పర్థలకు కారణమవుతోంది.
రియలైజేషన్ రావడం లేదు..:డాక్టర్ భరత్‌కుమార్, సైకియాట్రిస్టు, అపోలో ఆస్పత్రి
భార్యాభర్తల మధ్య ఏవైనా తగదాలు వస్తే రియలైజేషన్ వచ్చేది. ఒకరికొకరు తప్పు తెలుసుకుని సర్దుకుపోయే వారు. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితుల లేవు. వయస్సు పెరుగుతున్నప్పటికీ వారిలో రియలైజేషన్ రావడం లేదు. ఎవరికి వారు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇది కాస్తా పెరిగి నేను తగ్గడం ఎందుకనే ఇగో పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఇగో పెరగడానికి కారణాలు తెలుసుకోవాలి. ఒకరి అభిప్రాయాలు మరొకరు అర్థం చేసుకోవాలి. సమస్యకు కారణాలు గుర్తించాలి. ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ బాగా పెరగాలి.