నేపాల్ యువతిని హతమార్చిన ప్రియుడు
ABN , First Publish Date - 2022-12-01T12:16:26+05:30 IST
ప్రేమికులమధ్య తలెత్తిన చిన్న వివాదం పెను దారుణానికి దారితీసింది. బెంగళూరు(Bengaluru) రామమూర్తినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాల్‌కు చెంద
బెంగళూరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రేమికులమధ్య తలెత్తిన చిన్న వివాదం పెను దారుణానికి దారితీసింది. బెంగళూరు(Bengaluru) రామమూర్తినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాల్‌కు చెందిన కృష్ణకుమారి (23)ని ప్రియుడు సంతోష్దాని దారుణంగా హతమార్చాడు. హొరమావు ప్రాంతంలోని బ్యూటీ పార్లర్లో కృష్ణకుమారి(Krishna Kumari), టీసీ పాళ్యలోని మరో బ్యూటీ పార్లర్లో సంతోష్దాని పనిచేసేవారు. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఒకే గదిని అద్దెకు తీసుకుని లివింగ్ రిలేషన్షిప్ గడిపేవారు. మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. అంతలోనే కృష్ణకుమారి స్నేహితులకు వీడియోకాల్ చేసి గొడవను వివరించింది. వారు ఇంటికి చేరుకునే సరికే కృష్ణకుమారి స్పృహ కోల్పోయిందని పోలీసులు తెలిపారు. గొంతు నులిమి గోడకేసి బాదడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయిందని పోలీసులు తెలిపారు. వీరు రెండేళ్లుగా ప్రేమికులుగా ఉండేవారు. కృష్ణకుమారి ఇతరులతో సన్నిహితంగా ఉండడం, మరొకరితో సంబంధం ఉందనే అనుమానమే గొడవ జరిగినట్టు పోలీసులు తెలిపారు. రామమూర్తినగర్ పోలీసులు హత్యకేసు నమోదు చేసి సంతోష్దాని అరెస్టు చేసినట్టు తూర్పు విభాగం డీసీపీ బీమాశంకర్ గుళేద్ ప్రకటించారు.